బాధిత కుటుంబాలకు వివేక్ వెంకటస్వామి పరామర్శ

బాధిత కుటుంబాలకు వివేక్ వెంకటస్వామి పరామర్శ

పెగడపల్లి, వెలుగు: పెగడపల్లి మండలంలో మృతుల కుటుంబాలను చెన్నూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి, కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ పెద్దపల్లి  ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ సోమవారం పరామర్శించారు. ఐతుపల్లి గ్రామానికి చెందిన పాకాల రాజిరెడ్డి, అదే గ్రామానికి చెందిన  దయ్యాల రాజనర్సు ఇటీవల చనిపోయారు. వారి కుటుంబాలను పరామర్శించి ఆర్థిక సాయం అందజేశారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు రాములు గౌడ్, లీడర్లు శ్రీనివాస్ యాదవ్, రాజు, రాంరెడ్డి, జితేందర్ గౌడ్, రాకేశ్‌‌‌‌‌‌‌‌గౌడ్, కుమార్, అనిల్ గౌడ్ పాల్గొన్నారు.