గోదావరిఖని, వెలుగు: గోదావరిఖని కల్యాణ్‌నగర్‌లో పెద్దపల్లి జిల్లా బీజేపీ అధ్యక్షుడు రావుల రాజేందర్, కుటుంబ సభ్యులను బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి మంగళవారం పరామర్శించారు. రాజేందర్ తండ్రి రావుల రాజయ్య ఇటీవల అనారోగ్యంతో చనిపోయారు.
రాజయ్య ఫొటోకు వివేక్ వెంకటస్వామి పూలమాల వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆయన వెంట పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జి.సురేశ్‌రెడ్డి, పార్లమెంట్ కన్వీనర్ పి.మల్లికార్జున్, లీడర్లు సజ్జద్, రామన్న, మల్లికార్జున్‌గౌడ్, రాజేశ్, గోవర్ధన్‌రెడ్డి ఉన్నారు.