పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి జిల్లాలో బాధిత కుటుంబాలను బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ డాక్టర్ వివేక్ వెంకటస్వామి మంగళవారం పరామర్శించారు. ధర్మారం మండలం కొత్తూరుకు చెందిన కాంగ్రెస్ లీడర్మద్దెల రవీందర్ తల్లి గత వారం చనిపోయింది. ఆ కుటుంబాన్ని వివేక్ పరామర్శించారు. బొట్లవనపర్తి గ్రామంలో ఇటీవల చనిపోయిన బొంగాని సత్యం సోదరుడు ధర్మేందర్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. మృతుల ఫొటోల వద్ద నివాళులర్పించారు. కార్యక్రమంలో బీజేపీ లీడర్లు సూర్యనారాయణ, తిరుపతి, కిశోర్, లక్ష్మణ్, తిరుపతి, ప్రసాద్, మహేందర్ రెడ్డి, రామ్ నారాయణ పాల్గొన్నారు.
మోర్చాల సమావేశానికి
వివేక్ వెంకటస్వామి హాజరు
వెల్గటూర్, వెలుగు: ధర్మపురి నియోజకవర్గం వెల్గటూర్ మండలంలో రాజరంపల్లి లో బీజేపీ మోర్చా సంయుక్త సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు డా. జి. వివేక్ వెంకటస్వామి హాజరయ్యారు. ఆయనతోపాటు జగిత్యాల జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణరావు, పార్లమెంటు కన్వీనర్ మల్లికార్జున్, అసెంబ్లీ కన్వీనర్ సత్యం, మల్లేశం, సూర్యనారాయణ, చక్రపాణి, లీడర్లు పాల్గొన్నారు