ఎన్నికల్లో ఓడిపోయినా బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ నేతల అహంకారం తగ్గలే

ఎన్నికల్లో ఓడిపోయినా బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ నేతల అహంకారం తగ్గలే
  • రాష్ట్ర రాజకీయాలను నాశనం చేసిందే ఆ పార్టీ: వివేక్‌‌‌‌ వెంకటస్వామి
  • స్పీకర్ పదవిని గౌరవించడం అందరి బాధ్యత
  • జగదీశ్‌‌‌‌రెడ్డి సస్పెన్షన్‌‌‌‌ కరెక్టేనని వ్యాఖ్య
  • పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో పర్యటన 

పెద్దపల్లి/కోల్‌‌‌‌బెల్ట్, వెలుగు: స్పీకర్ పదవిలో ఉన్నవారిని ప్రతి ఒక్కరూ గౌరవించాలని, ఆ పదవిని కించపరిస్తే సస్పెండ్ చేయడమే సరైన నిర్ణయమని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. రాష్ట్రంలో రాజకీయాలను బీఆర్ఎస్ నాశనం చేసిందని విమర్శించారు. ఎన్నికల్లో ఓడిపోయినా.. ఆ పార్టీ నేతల్లో ఇంకా అహంకారం తగ్గలేదని మండిపడ్డారు. శుక్రవారం పెద్దపల్లి జిల్లాలో పర్యటించిన ఆయన.. గోపాల్​రావుపేట, దొంగతుర్తిలోని వెంకటేశ్వరస్వామి, మల్లికార్జునస్వామి ఆలయాల్లో ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌తో​కలిసి ప్రత్యేక పూజలు చేశారు. 

ఆలయ అర్చకులు వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయ అభివృద్ధికి సహకరించినందుకు ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామిని సత్కరించారు. అనంతరం వివేక్‌‌‌‌ మాట్లాడుతూ, బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి మాట్లాడిన తీరు స్పీకర్‌‌‌‌‌‌‌‌ను హేళన చేసేలా ఉందని, అలా మాట్లాడిన ఎమ్మెల్యేను సస్పెండ్ చేయడం సరైందేనన్నారు. గోపాల్‌‌‌‌రావు పేట గ్రామంతో తన కుటుంబానికి మంచి అనుబంధం ఉందని గుర్తుచేశారు. తాను ఎంపీగా ఉన్నప్పుడు బ్రిడ్జి కావాలని గ్రామస్తులు కోరారని, ఈ విషయాన్ని తన తండ్రి వెంకటస్వామికి చెప్తే జీవన్ రెడ్డితో మాట్లాడి వెంటనే మంజూరు చేయించారన్నారు.

 గ్రామస్తుల కోరిక మేరకు విశాక ట్రస్ట్ నుంచి స్కూల్‌‌‌‌ విద్యార్థులకు బెంచీలు అందించామని తెలిపారు. ఇక్కడి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని స్థానిక ఎమ్మెల్యే, ఎంపీల సహకారంతో అభివృద్ధి చేసుకుందామని చెప్పారు. కాకా వెంకటస్వామి కుటుంబానికి గోపాల్ రావు గ్రామానికి మంచి అనుబంధం ఉందని  విప్ అడ్లూరి లక్ష్మణ్‌‌‌‌ అన్నారు.  అనంతరం పెద్దపల్లిలో ఇటీవల వివాహమైన రమేశ్‌‌‌‌ గౌడ్ కూతురు, అల్లుడిని వివేక్ ఆశీర్వదించారు. పెద్దపల్లి మాజీ మున్సిపల్ చైర్మన్ ఎలువక రాజయ్య ఇంట్లో లంచ్‌‌‌‌కు హాజరయ్యారు. 

ముస్లింల సంక్షేమానికి కాంగ్రెస్ పెద్దపీట..

ముస్లింల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, చెన్నూరు నియోజకవర్గంలో ముస్లింల అభివృద్ధికి రూ.70 లక్షలు మంజూరు చేశామని వివేక్ తెలిపారు. శుక్రవారం ఆయన మంచిర్యాల జిల్లా మందమర్రి, క్యాతనపల్లి మున్సిపాలిటీల్లో పర్యటించారు. రంజాన్ సందర్భంగా మందమర్రిలోని ఆస్రా మసీదులో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ముస్లింలకు ముందస్తుగా రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఇఫ్తార్ విందులు మత సామరస్యానికి, ఐక్యతకు నిదర్శనమన్నారు. ఖురాన్ నేర్పిన బాటలో ముస్లిం సోదరులు నడుస్తున్నారని పేర్కొన్నారు. 

చెన్నూరు నియోజకవర్గంలో ముస్లింలకు సంబంధించిన అభివృద్ధి పనులను త్వరలో ప్రారంభిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా ముస్లింలు వివేక్‌‌‌‌ను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ముస్లింపెద్దలు, మందమర్రి సీఐ శశిధర్ రెడ్డి, మందమర్రి, రామకృష్ణాపూర్ ఎస్సైలు రాజశేఖర్, జి.రాజశేఖర్​, స్థానిక కాంగ్రెస్ లీడర్లు పాల్గొన్నారు. 

అంబేద్కర్ భవనం కోసం స్థలాల పరిశీలన.. 

మందమర్రిలో అంబేద్కర్ భవన్ నిర్మాణం కోసం అనువైన స్థలాలను వివేక్ వెంకటస్వామి పరిశీలించారు. స్థానిక పోలీస్ స్టేషన్ పరిసరాల్లో, ఎమ్మెల్యే కాలనీ, మార్కెట్ ప్రాంతాల్లోని ఖాళీ స్థలాలను చూశారు. ఈ స్థలాలకు సంబంధించిన వివరాలను మందమర్రి తహసీల్దార్ సతీశ్ కుమార్‌‌‌‌‌‌‌‌ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గోపతి రాజయ్యను వివేక్‌‌‌‌ పరామర్శించారు. ఆయనకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మందమర్రి పాతబస్టాండ్ ఏరియాకు చెందిన చిలకాని సుదర్శన్ కుమారుడు కుమార్, ఏఐటీయూసీ లీడర్ రమణ తల్లి నాగేశ్వరమ్మ ఇటీవల మృతి చెందగా బాధిత కుటుంబాలను పరామర్శించారు.