పోడు రైతులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలి: వివేక్ వెంకటస్వామి

పోడు రైతులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలి: వివేక్ వెంకటస్వామి

 పోడు రైతులపైన పెట్టిన కేసులు ఎత్తివేయాలని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి డిమాండ్ చేశారు.  మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలంలోని అక్కేపల్లి గ్రామంలో  జైలు నుండి విడుదలైన పోడు  రైతులను వివేక్ వెంకటస్వామి పరామర్శించారు. ఈ సందర్భంగా వారి వివరాలు అడిగి తెలుసుకున్న ఆయన.. పోడు రైతులందరికీ పట్టాలివ్వాలన్నారు.

కేసీఆర్ ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదన్నారు. పోడు రైతులకు బీజేపీ అండగా ఉంటుందన్నారు. కేసీఆర్ ను గద్దె దించి తగిన బుద్ధి చెప్పాలన్నారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ను ఓడించి అవినీతి ప్రభుత్వానికి చరమగీతం పాడాలని సూచించారు..