కేసీఆర్, బాల్క సుమన్ లు జైలుకు వెళ్లడం ఖాయం

సొంత కార్యకర్తలే బాల్క సుమన్ ను ఓడిస్తారని చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి వివేక్ వెంకటస్వామి అన్నారు.  మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో 2023, నవంబర్ 14వ తేదీ మంగళవారం వివేక్ వెంకటస్వామి కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు తరలి వచ్చారు.అనంతరం ఆయన బుద్ధారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇక్కడ ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్న బాల్క సుమన్ ప్రజలను పట్టించుకోలేదని విమర్శించారు.  బీఆర్ఎస్ పార్టీ కోసం ఎంతో కష్టపడి కార్యకర్తలను కూడా సుమన్ పట్టించుకోలేదని మండిపడ్దారు. తమ సమస్యలు చెప్పుకునేందుకు కార్యకర్తులు ఫోన్ చేస్తే ఎత్తకుండా.. వారిని ఇష్టమొచ్చినట్లు దూషిస్తూ అహంకారంగా వ్యవహరించాడని చెప్పారు. 

బాల్క సుమన్ తీరుతో విసిగెత్తిపోయిన ప్రజలు.. ఆయనను ఇంటికి పంపించేందుకు సిద్ధమయ్యారని అన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలే బాల్క సుమన్ కు వ్యతిరేకంగా ఉన్నారని..ఈ సారి కాంగ్రెస్ కే ఓటు వేస్తామని చెబుతున్నారన్నారు. ప్రజల సమస్యలను పెక్కన పెట్టి.. ఇసుక దందా, బొగ్గు దందా, భూ దందాలతో రూ.వెయ్యి కోట్లు సంపాదించాడని ఆరోపించారు. రీ డిజైన్ పేరుతో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి కేసీఆర్ లక్ష కోట్లు దోచుకున్నాడని.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దోచుకున్న సొమ్మును కక్కిస్తామన్నారు.

తనకే ఓటు వేయాలని.. లేకపోతే  కేసులు పెడతామని బాల్క సుమన్ బెదరిస్తున్నాడన్నారు. బాల్క సుమన్ పై జనం తిరగబడి బట్టలు విప్పి కొట్టే రోజు వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ తోపాటు అవినీతికి పాల్పడిన బాల్క సుమన్ కూడా జైలుకు వెళ్లడం ఖాయమన్నారు.బుద్ధారంలో  రోడ్లు అద్వాన్నంగా ఉన్నాయని.. బీఆర్ఎస్ గుర్తు కారు గుర్తు... గుర్తు కోసం అయిన రోడ్లు వేయాలి కదా అని ప్రశ్నించారు. 9 ఏండ్లుగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నా ఇలాంటి దుస్థితి నెలకొందని.. మళ్లీ గెలిస్తే పనులు చేస్తామని ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. 

ALSO READ : తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ వైపే ప్రజలు : ఏనుగు రవీందర్ రెడ్డి

 కాంగ్రెస్ పార్టీ జనం నుంచి మంచి స్పందన వస్తుందని.. కాంగ్రెస్ కార్యకర్తలంతా కలిసి ముందుకు సాగాలని ఆయ పిలుపునిచ్చారు. సోనియాగాంధీ ఇచ్చిన 6 గ్యారెంటీలు తప్పకుండా అమలు చేస్తామన్నారు. సోనియాగాంధీ కర్ణాటకలో ఇచ్చిన హామీలన్నీ అమలు అవుతున్నాయని.. కాంగ్రెస్ కు ఓటు వేసి గెలిపించాలని వివేక్ కోరారు. ప్రచారంలో భాగంగా వివేక్ వెంకటస్వామి.. అనారోగ్యానికి గురైన కార్యకర్తల ఇంటికి వెళ్లి పరామర్శించారు. వారికి అండగా ఉంటామని భరోసా నిచ్చారు.