సింగరేణి ప్రైవేటీకరణ కుట్రను తిప్పికొట్టాలె: వివేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెంకటస్వామి

సింగరేణి ప్రైవేటీకరణ కుట్రను తిప్పికొట్టాలె: వివేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెంకటస్వామి
  •     కార్మికుల సొంతింటి కల నెరవేరుస్తా
  •     ఎస్సార్పీ 1 గని గేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పెద్దపల్లి ఎంపీ క్యాండిడేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గడ్డం వంశీకృష్ణ
  •     కొత్త గనుల ఏర్పాటుకు కృషి
  •     కేకే ఓసీపీపై చెన్నూరు ఎమ్మెల్యే వివేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెంకటస్వామి

కోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బెల్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు : సింగరేణిని ప్రైవేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పరం చేసే కుట్రలను తిప్పికొట్టాలని పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ క్యాండిడేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గడ్డం వంశీకృష్ణ పిలుపునిచ్చారు. కార్మికులకు అండగా ఉండి వారి సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సింగరేణి ఏరియా ఎస్సార్పీ–1 గనిపై ఏఐటీయూసీ ఆధ్వర్యంలో శుక్రవారం గేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిర్వహించారు. 

ఈ సందర్భంగా వంశీకృష్ణ మాట్లాడుతూ బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పదేండ్ల పాలనలో సింగరేణిలో కొత్తగా ఒక్క బొగ్గు గని కూడా తవ్వలేదన్నారు. కార్మికుల క్వార్టర్లను బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లీడర్లు ఆక్రమించుకున్నారని, సింగరేణి సంస్థను మాజీ సీఎం కేసీఆర్ అమ్ముకున్నారని ఆరోపించారు. బొగ్గు గనులను ఇందిరాగాంధీ హయాంలో జాతీయం చేస్తే, బీజేపీ, బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాత్రం ప్రైవేటీకరణకు కుట్ర చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. బొగ్గు బ్లాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల వేలం కోసం బీజేపీ సర్కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పార్లమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తీర్మానం చేస్తే అప్పటి టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎంపీలు అనుకూలంగా ఓటు వేశారని చెప్పారు. 

తెలంగాణ ఉద్యమంలో సింగరేణి కార్మికుల పాత్ర కీలకమైందన్నారు. మాజీ సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ప్రజలపై ఆర్థిక భారం మోపారని మండిపడ్డారు. బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లీడర్లు తీసుకున్న క్వార్టర్లను తిరిగి కార్మికులకు అప్పగిస్తామని, సింగరేణి కార్మికుల ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కం ట్యాక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రద్దు కోసం పార్లమెంటులో మాట్లాడుతానని హామీ ఇచ్చారు. కాకా స్ఫూర్తితో ప్రజలకు సేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. పెద్దపల్లి ఎంపీగా తనను గెలిపిస్తే ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఏఐటీయూసీ స్టేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వాసిరెడ్డి సీతారామయ్య, బాజీ సైదా పాల్గొన్నారు.

సింగరేణి అనుబంధ పరిశ్రమలను ప్రోత్సహిస్తాం: వివేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెంకటస్వామి

సింగరేణిలో కొత్త బొగ్గు గనుల ఏర్పాటుకు కృషి చేస్తామని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెంకటస్వామి చెప్పారు. మంచిర్యాల జిల్లా మందమర్రి సింగరేణి ఏరియా కేకే ఓసీపీపై ఐఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీయూసీ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన గేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వివేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెంకటస్వామితో పాటు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, ఐఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీయూసీ సెక్రటరీ జనరల్ బి.జనక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రసాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెంకటస్వామి మాట్లాడుతూ కాకా చొరవ వల్లే కార్మికులకు పెన్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విధానం అమల్లోకి వచ్చిందన్నారు. మూతపడిన రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని తాను ఎంపీగా పనిచేసిన కాలంలో తిరిగి ఓపెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయించానని గుర్తు చేశారు. 

ఏటా 2 కోట్ల ఉద్యోగాలు, బ్లాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మనీ తీసుకొచ్చి పేదల అకౌంట్లో రూ.15 లక్షలు వేస్తామన్న బీజేపీ హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. కేసీఆర్ అవినీతి, అక్రమాలకు వ్యతిరేకంగా పనిచేసినందుకే తనపై కక్ష కట్టి పటాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చెరులోని ఫ్యాక్టరీని మూసివేయించారన్నారు. సింగరేణి సంస్థ సహకారంతో అనుబంధ పరిశ్రమలు, సిమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని చెప్పారు. వంశీకృష్ణను పెద్దపల్లి ఎంపీగా గెలిపించేందుకు కార్మికులు సహకరించాలని కోరారు. సమావేశంలో ఐఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీయూసీ లీడర్లు కాంపెల్లి సమ్మయ్య, దేవి భూమయ్య, నరేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాల్గొన్నారు.

ఉపాధి కూలీలను కలిసిన వంశీకృష్ణ, వివేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెంకటస్వామి

మందమర్రి మండలం బొక్కలగుట్టలో ఉపాధి హామీ కూలీలను శుక్రవారం పెద్దపల్లి కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్యాండిడేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గడ్డం వంశీకృష్ణ, చెన్నూరు ఎమ్మెల్యే  వివేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెంకటస్వామి కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాహుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గాంధీ ప్రధాని అయితే ఉపాధి కూలీలకు రోజుకు రూ.400 అందేలా చూస్తామన్నారు. ఉపాధి హామీ పథకం కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హయాంలోనే స్టార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయిందన్నారు. 

ఇంటికో ఉద్యోగం, డబుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రూం ఇండ్లు, దళితులకు మూడు ఎకరాల స్థలం ఇస్తానని చెప్పిన కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నమ్మించి మోసం చేశారన్నారు. తన కుటుంబ సభ్యులకు పదవులు ఇచ్చుకొని ప్రజలను మాత్రం పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. వంశీకృష్ణను ఎంపీగా గెలిపిస్తే ప్రభుత్వ రంగ సంస్థలు, కంపెనీలు తీసుకొచ్చి నిరుద్యోగులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని చెప్పారు. వారి వెంట మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, నాయకులు దుర్గం నరేశ్, మాజీ ఎంపీపీ బొలిశెట్టి కనుకయ్య, సర్పంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సువర్ణ, కిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు పాల్గొన్నారు.