ఆరు గ్యారెంటీలతో ఇంటింటా సౌభాగ్యం : వివేక్ వెంకటస్వామి

ఆరు గ్యారెంటీలతో ఇంటింటా సౌభాగ్యం : వివేక్ వెంకటస్వామి

కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీల హామీలను కచ్చితంగా అమలు చేసి తీరతామని చెన్నూరు నియోజకవర్గం  కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా 2023, నవంబర్ 27వ తేదీ సోమవారం నియోజకవర్గంలోని  మందమర్రి మండలం పాత తిమ్మాపూర్, కుర్మపల్లి గ్రామాల్లో వివేక్ ప్రచారం నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి కుటుంబానికి ఆరు గ్యారంటీలను అమలు చేస్తామన్నారు.  తనను ఓడించేందుకు బాల్కసుమన్, కేసీఆర్  కలిసి తనపై ఐటీ రైడ్స్ చేయించారని.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సుమన్, కేసీఆర్ లకు అరెస్టు చేయడం పక్కా అని అన్నారు. కేసీఆర్, కేటీఆర్ ఫామ్ హౌస్ ల గురించి మాట్లాడినందుకు రేవంత్ రెడ్డిని జైల్లో పెట్టారని.. లిక్కర్ స్కాంలో కవితను కేంద్ర ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు.  నాపై ఎంత ఒత్తడి తెచ్చినా కేసీఆర్ పై పోరాటం ఆగదన్నారు.

కేసీఆర్ గతంలో ఫేక్ పాస్ పోర్ట్ దందాతో ప్రజలను మోసం చేశాడని.. కేసీఆర్  పై ఫెమా, ఈడీ కేసులు పెట్టి చర్యలు తీసుకోవాలన్నారు. అవినీతి బీఆర్ఎస్ ను గద్దె దించాలని.. కాంగ్రెస్ తోనే తెలంగాణలో ప్రజల జీవితాలు బాగుపడుతాయన్నారు. కాంగ్రెస్ ఓటు వేసి తనను గెలిపించాలని ఆయన కోరారు. వివేక్ తోపాటు ఆయన  సతీమణి సరోజ వివేక్ కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెడుతున్న ఆరు గ్యారంటీ పథకాలను ప్రజలకు వివరిస్తూ ఆమె ఇంటింటి ప్రచారం చేశారు.