
బాల్కసుమన్ ఇసుక దందాతో వేల కోట్లు సంపాదించారని చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి అన్నారు. సంపాదించిన వేల కోట్లతోనే ఓటుకు 5 వేలు ఇచ్చి కొంటా అంటున్నారని ధ్వజమెత్తారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం మందమర్రిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు వివేక్ వెంకటస్వామి. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. సింగరేణి కార్మికులకు పెన్షన్ ఇప్పించింది కాకా వెంకటస్వామి అని అన్నారు. సింగరేణి సంస్థను ఎలా దోచుకోవాలని.. కేసీఆర్ చూస్తున్నారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు గంగలో కలిసిందన్నారు. కేసీఆర్ కు కల్వకుంట్ల కమీషన్ రావు అని పేరు పెట్టింది తానేనన్నారు. తెలంగాణలో అత్యంత అవినీతి పరుడు కేసీఆర్ అని ఆరోపించారు వివేక్ వెంకటస్వామి. కేసీఆర్ ను తరిమికొట్టాలంటే కాంగ్రెస్ కు ఓటు వేసి గెలిపించాలన్నారు.
చెన్నూరులో బీఆర్ఎస్ నుంచి బాల్కసుమన్ పోటీచేస్తుండగా.. కాంగ్రెస్ నుంచి జి.వెంకటస్వామి..బీజేపీ నుంచి దుర్గం అశోక్ బరిలోకి దిగుతున్నారు. వివేక్ వెంకటస్వామి ఇప్పటికే చెన్నూరులో జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్ కు ఓటెయ్యాలని కోరుతున్నారు. చెన్నూరులో బాల్కసుమన్ అవినీతి అక్రమాలను ప్రజలకు వివరిస్తున్నారు.