కేసీఆర్​ పాస్​ పోర్టు దొంగ.... చెన్నూరు సభలో వివేక్​ వెంకటస్వామి

చెన్నూరు నియోజకవర్గం.. బైబై కేసీఆర్​.. బైబై బాల్కసుమన్... జైజై కాంగ్రెస్.. అనే​ ​ నినాదాలతో మారు మ్రోగింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అనంతరం నీళ్ళు నిధులు నియామకాల పేరుతో ప్రజలను మోసము చేసిన కేసీఆర్ ప్రభుత్వాన్ని తరిమి వేయాల్సిన సమయం ఆసన్నమైందని మాజీ ఎంపి చెన్నూరు నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి అన్నారు. మంగళవారం ( నవంబర్​ 28)  కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు  చెన్నూరులో రోడ్​ షో నిర్వహించారు.  ఈ ర్యాలీలో తీన్మార్​ మల్లన్న, కాంగ్రెస్​ అభ్యర్థి  వివేక్ వెంకటస్వామి , మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు  పాల్గొన్నారు. 

తెలంగాణ ప్రజలకు ఎన్నో వాగ్ధానాలు చేసి అధికారంలోకి వచ్చినకేసీఆర్ ప్రజలను మోసం చేశారని వివేక్​ వెంకటస్వామి అన్నారు. చెన్నూరు ప్రజలను బాల్కసుమన్​ దోచుకున్నాడని వివేక్​ వెంకటస్వామి ఆవేదన వ్యక్తం చేశారు. తన తండ్రి వెంకటస్వామి హయాంలో సింగరేణి సంస్థ ఏర్పాటు  స్థానికులకు  ఉద్యోగాలు వచ్చేలా కృషి చేశారన్నారు.  బాల్క సుమన్​ హయాలంలో కొత్త ఉద్యోగాలు రాకపోగా.. ఉన్న ఉద్యోగాలు ఊడే పరిస్థితి వచ్చిందన్నారు.  

వివేక్​ వెంకటస్వామి  ప్రసంగంలోని హైలైట్స్​

  • కేసీఆర్​ కాళేశ్వరం పేరుతో లక్షల కోట్లు దోచుకున్నారు
  • ధరణి పోర్టల్​ తో  కేటీఆర్​ రంగారెడ్డి జిల్లాలో భూ దోపిడి చేశారు
  • కేసీఆర్​ కుటుంబం.. బాల్క సుమన్​ తో  కలిసి.. చెన్నూరు నియోజకవర్గంలో మిషన్​ భగీరథలో 80 వేల కోట్లు దోచుకున్నారు
  • కేసీఆర్​ పాస్​పోర్ట్​ దొంగ..  కేసీఆర్​, బాల్క సుమన్​ ను జైలుకు పంపిస్తాం
  • బంగారు తెలంగాణ కాలేదు కాని.. కల్వకుంట్ల కుటుంబం మాత్రం  బంగారు కుటుంబంగా మారింది
  • కేసీఆర్​ ను బొందపెట్టాల్సిన టైం వచ్చింది
  • ఇసుక దందాలతో బాల్కసుమన్​కోట్లకు పడగలెత్తారు
  • నా తండ్రి గారు సింగరేణి సంస్థను తీసుకొచ్చారు
  • చెన్నూరు నియోజకవర్గంలో ఉద్యోగ కల్పనకు స్కిల్​ డెవలప్​ మెంట్​ సెంటర్లు ఏర్పాటు చేయిస్తా
  • చెన్నూరుకు ఇచ్చిన గ్యారంటీలను అమలు చేస్తా
  • చెన్నూరు నియోజకవర్గాన్ని అభివృద్ది చేస్తా