ఈ నెల 12న ప్రధాని మోడీ RFCL ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరవుతున్న సందర్భంగా సభా వేదిక ఏర్పాట్లను బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి పరిశీలించారు. అక్కడున్న వారికి పలు సూచనలు, సలహాలు చేశారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలోని రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (ఆర్‌ఎఫ్‌సీఎల్)ను మోడీ జాతికి అంకితం చేయనున్నారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొని ఆయన ప్రసంగించనున్నారు.
గతంలో మూతబడిన రామగుండం ఎఫ్‌సీఐ పునరుద్ధరణకు కేంద్రం చర్యలు తీసుకుంది. మొత్తం రూ. 6,120 కోట్లతో కేంద్ర ప్రభుత్వం రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని పునర్నిర్మాణం చేసింది. గతేడాది మార్చి 22న ఆర్ఎఫ్‌సీఎల్ వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించినట్టుగా ప్రకటించింది. ఇప్పుడు నరేంద్ర మోడీ అధికారికంగా జాతికి అంకితం చేయనున్నారు. ప్రధాని మోడీ పర్యటన నేపథ్యంలో ఆర్ఎఫ్ సిఎల్ (RFCL)ను కేంద్ర ఎరువుల, రసాయన శాఖ కార్యదర్శి అరుణ్ సింఘాల్ ఇటీవలే సందర్శించారు.
https://twitter.com/VivekVenkatswam/status/1588512887743467520