కోల్ బెల్ట్, వెలుగు: మాలల సింహగర్జనను విజయవంతం చేసి మాలల ఐక్యత,సత్తాను ఢిల్లీకి వినిపించేలా చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి చేశారని మాల సంఘాల జేఏసీ లీడర్లు పేర్కొన్నారు. బుధవారం మంచిర్యాల హై టెక్ సిటీ కాలనీ లోని ఎమ్మెల్యే నివాసంలో మాల,మాల ఉద్యోగుల జేఏసీ మంచిర్యాల జిల్లా కమిటీ లీడర్లు ఎమ్మెల్యే ను కలిశారు. ఈ సందర్భంగా లీడర్లు మాట్లాడుతూ.. అంబేద్కర్ రాజ్యాంగ రక్షణ, సిద్ధాంతాల కోసం, మాలల ఐక్యత అభివృద్ధి కోసం సమష్టి గా పనిచేస్తామన్నారు.
రాబోయే రోజుల్లో ఆర్థికంగా మాలలు అభివృద్ధి చెందేలా ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కృషి చేయాలని కోరారు. ఎల్లప్పుడూ తమ వెన్నంటే ఉంటామని మాలల కోసం అహర్నిశలు చేస్తున్న కృషి వెలకట్టలేనిదని కొనియాడారు. అనంతరం ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ని శాలువాతో పూలమాలతో సన్మానించారు.
ఈ కార్యక్రమంలో మాల,మాల ఉద్యోగుల జేఏసీ మంచిర్యాల జిల్లా కన్వీనర్ తోగరు సుధాకర్, కో- కన్వీనర్లు కూన రవి కుమార్, జూపాక సుధీర్,గజేల్లి లక్ష్మణ్, కుంభాల రాజేష్, పొట్ట మధుకర్, కాసర్ల యాదగిరి, పలిగిరి కనకరాజు, ముత్త మాల పుల్లయ్య, భూపెల్లి మల్లన్న, మండల రవి కుమార్, దేవరపల్లి మధు, మనోజ్, బైరం ప్రభాకర్, మేడ రాజన్న, సీలం వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.