
1969లో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం వీహెచ్ దేశాయ్ పోరాడారన్నారు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి. రాష్ట్ర ప్రభుత్వం వీహెచ్ దేశాయ్ విగ్రహాన్ని ఏర్పాటు చెయ్యాలని కోరారు. హోమ్ మంత్రి మహమూద్ అలీ వీహెచ్ దేశాయ్ విగ్రహాన్ని ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వీహెచ్ దేశాయ్ బయో-గ్రఫి ది అన్ సంగ్ హీరో, హైదరాబాద్ ఫ్రీడం స్ట్రగుల్ పై రాసిన బుక్ ను హోంమంత్రి మహమూద్ అలీతో కలిసి వివేక్ వెంకటస్వామి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వివేక్ వెంకటస్వామిని హోం మంత్రి మహమూద్ అలీ, స్వామి రామతీర్థ మెమోరియల్ కమిటీ సభ్యులు శాలువా కప్పి పుష్పగుచ్చంతో సన్మనించారు.
వీహెచ్ దేశాయ్ తనకు మంచి స్నేహితులు అని చెప్పారు వివేక్ వెంకటస్వామి. వీహెచ్ దేశాయ్ కుటుంబ సభ్యులతో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పారు. వీహెచ్ దేశాయ్ పుత్రులు వీహెచ్ బయోగ్రఫి పుస్తకాన్ని రాసినందుకు వారిని అభినందిస్తున్నానని వివేక్ వెంకటస్వామి చెప్పారు. క్విట్ ఇండియా మూవ్ మెంట్ నుండి ప్రత్యేక తెలంగాణ వరకు ఆని అంశాలు ఈ పుస్తకంలో ఉంటాయన్నారు.