ఆకట్టుకుంటున్న వెంకట్ గడ్డం పెయింటింగ్స్

ఆకట్టుకుంటున్న  వెంకట్ గడ్డం పెయింటింగ్స్

హైదరాబాద్​, వెలుగు: మహిళల మనోభావాలు, వారి హావభావాలు, చిన్నప్పటి నుంచి పెరిగి పెద్దయి బాధ్యతలను భుజాలకెత్తుకునేదాకా వారి జీవన విధానం, వాళ్లు ఎదుర్కొనే సవాళ్లు, బంధాలను కుంచెతో చాలా అందంగా పలికించారు మాజీ ఎంపీ, బీజేపీ కోర్​ కమిటీ సభ్యుడు వివేక్​ వెంకట స్వామి కుమారుడు వెంకట్​ గడ్డం. ఆయన తన తొలి సోలో ఆర్ట్​ ఎగ్జిబిషన్​ను శనివారం ఏర్పాటు చేశారు. హైదరాబాద్​ బంజారాహిల్స్​లోని సప్తపర్ణిలో నిర్వహించిన ఎగ్జిబిషన్​లో 44 పెయింటింగ్స్​ను ప్రదర్శనకు ఉంచారు. ప్రతి పెయింటింగ్​కు దాని వెనుక ఉన్న అర్థాన్ని, భావాన్ని ఆయన రాసి పెట్టారు. ఆయన వేసిన పెయింటింగ్స్​ సందర్శకులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి వివేక్​ వెంకటస్వామి, ఆయన భార్య, విశాక ఇండస్ట్రీస్​ ఎండీ సరోజా వివేక్​లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వెంకట్​ గడ్డం ఆర్ట్స్​ లోగోను వివేక్​ ఆవిష్కరించారు. చిన్న నాటి నుంచి వెంకట్​కు ఆర్ట్స్​ అంటే ఆసక్తి అని వివేక్​ చెప్పారు. 11 ఏళ్ల వయసులోనే మొదటి ఆర్ట్​ ఎగ్జిబిషన్​ను కళాభవన్​లో ఏర్పాటు చేశామని ఆయన గుర్తు చేశారు. తనలాగే తన కుమారుడు కూడా బిజినెస్​మ్యాస్​ కావాలనుకున్నానని, కానీ, తన పెయింటింగ్​ ట్యాలెంట్​ను చూశాక అది తప్పని అర్థమైందని చెప్పారు. మూడేళ్ల వయసు నుంచే పెన్​, పెన్సిల్​తో వెంకట్​ పెయింటింగ్స్​ వేసేవారని సరోజ గుర్తు చేశారు. చిన్నప్పుడు దేవతల కథలను బాగా చెప్పానని, టెంపుల్స్​కు తీసుకెళ్లానని, ఇప్పుడు పెయింటింగ్స్​లో వాటిని చూస్తున్నానని ఆమె చెప్పారు. ఆక్రలిక్​ ఆన్​ కాన్వాస్​ థీమ్​తో పెయింటింగ్స్​ వేశానని వెంకట్​ తెలిపారు. 2018 నుంచి ఇప్పటిదాకా వేసిన పెయింటింగ్స్​ను ఎగ్జిబిషన్​లో పెట్టామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎ మ్మెల్యే ఏనుగు రవీందర్​, విల్​ మీడియా డైరెక్టర్​ వైష్ణవి, వీ6, వెలుగు సీఈవో అంకం రవి తదితరులు పాల్గొన్నారు. ప్రదర్శన ఆదివారంతో ముగియనుంది.