మునుగోడు ఉప ఎన్నిక సెమీఫైనల్ కాదు.. ఫైనల్ : వివేక్ వెంకటస్వామి

మునుగోడు ఉప ఎన్నిక బీజేపీకి సెమీ ఫైనల్ కాదు, ఫైనల్ అని స్టీరింగ్ కమిటీ సభ్యుడు వివేక్ వెంకటస్వామి అన్నారు. మునుగోడు మండల కేంద్రంలో బీజేపీ మహిళా మోర్చా నాయకులతో సమావేశమైన ఆయన..  ప్రచారంపై వారికి దిశా నిర్దేశం చేశారు. మునుగోడులో గెలిస్తే వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ తప్పకుండా అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 

టీఆర్ఎస్ వాళ్లు మద్యం, డబ్బుతో ఓటర్ల మైండ్ మార్చే ప్రయత్నం చేస్తున్నారని, దాన్ని తిప్పి కొట్టాలని వివేక్ వెంకటస్వామి పిలుపునిచ్చారు.  బీజేపీ పార్టీ గుర్తు ప్రతి ఇంటికి చేరేలా పనిచేయాలని మహిళా మోర్చా నేతలకు సూచించారు. కేంద్ర ప్రభుత్వం కొవిడ్ టైంలో ఉచిత వ్యాక్సిన్ అందించిన విషయాన్ని ఓటర్లకు గుర్తు చేయాలని చెప్పారు. యూపీలో బీజేపీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజల్లో అవగాహన కల్పించి రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వస్తే వాటిని అమలు చేస్తారన్న భరోసా కల్పించాలని అన్నారు.