లక్ష్మణ్ బాపూజీ చివరి శ్వాస వరకు ప్రజల కోసమే పోరాడారు

తెలంగాణ సాధన కోసం జీవితాంతం పోరాడిన ఉద్యమకారుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి అన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. లక్ష్మణ్ బాపూజీని యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు. లక్ష్మణ్ బాపూజీ చివరి శ్వాస వరకు ప్రజల కోసమే పోరాడారని చెప్పారు.  

బీజేపీ మండల ఇంఛార్జ్ లతో భేటీ

మునుగోడు బైపోల్ లో బీజేపీ మండల ఇంఛార్జ్ లు పూర్తిస్థాయిలో పని చేయాలని వివేక్ వెంకటస్వామి సూచించారు. ఇవాళ మునుగోడు నియోజకవర్గంలో పర్యటించారు. బీజేపీ మండల ఇంఛార్జ్ లతో భేటీ అయ్యారు. అందరు నాయకులను సమన్వయం చేసేలా కమిటీలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కల్వకుంట్ల కుటుంబ పాలనను తరిమికొట్టేందుకు అందరూ కలిసికట్టుగా పని చేయాలని సూచించినట్లు వివేక్ తెలిపారు. మునుగోడులో రాజగోపాల్ రెడ్డి గెలుపే లక్ష్యంగా పార్టీ క్యాడర్ కు దిశానిర్దేశం చేసినట్లు చెప్పారు.