ధర్మారం, వెలుగు: రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో మంచి వర్షాలు కురిసి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కాంగ్రెస్ సీనియర్ నేత, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఆకాంక్షించారు. గురువారం పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం కమ్మరిఖాన్ పేట గ్రామంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన రేణుక ఎల్లమ్మ బోనాలు, ఆలయ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, కాంగ్రెస్ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా అడ్లూరి లక్ష్మణ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అన్ని నెరవేర్చేలా సీఎం రేవంత్ రెడ్డికి ఎల్లమ్మ తల్లి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నట్లు చెప్పారు. గడ్డం వంశీకృష్ణ మాట్లాడుతూ అప్పుల రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లెలా శక్తిని కల్పించాలని తల్లిని కోరుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి, లీడర్లు కన్నం అంజయ్య, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు తిరుపతి రెడ్డి, నిషాంత్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, సూర్యనారాయణ, రవీందర్ రెడ్డి, నరసింహులు, లింగయ్య గౌడ్, తిరుపతి, శంకరయ్య, చిరంజీవి, రాజేశం, స్వామి తదితరులు పాల్గొన్నారు.
వివేక్ వెంకటస్వామికి సన్మానం
గోదావరిఖని, వెలుగు : చెన్నూరుఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామిని ఆల్ఇండియా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో గురువారం ఘనంగా సన్మానించారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని నివాసంలో ఆయనను కలిశారు. యువజన సంఘం స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరి మధు, పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల అధ్యక్షులు లంక సదయ్య, నెరువట్ల రాజలింగం, లీడర్లు చంద్రమౌళి, లింగయ్య, రాజేశం, కిష్టయ్య, రవీందర్‌కుమార్, నరేశ్, గణపతి, దేవయ్య, శ్రీనివాస్, రాజు,మధు, పాల్గొన్నారు.