![కాకా 9వ వర్ధంతి.. నివాళి అర్పించిన ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి](https://static.v6velugu.com/uploads/2023/12/vivek-venkataswamy-participated-in-kaka-venkataswamy-9th-death-anniversary-celebration_AiTufeYVw8.jpg)
కాకా వెంకటస్వామి 9వ వర్ధంతి సందర్భంగా ట్యాంక్ బండ్ దగ్గర ఆయన విగ్రహానికి నివాళి అర్పించారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, ఆయన సోదరుడు బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ . వీరితో పాటు మాజీ మంత్రి శంకరయ్య కూడా ట్యాంక్ బండ్ దగ్గర కాకా విగ్రహానికి నివాళి అర్పించారు.
దళిత సంఘాలు, ఆయన అభిమానులు భారీగా చేరుకుని విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. నిరుపేదలకు కాకా అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు.
కాకా బాటలోనే తాము ప్రయాణిస్తున్నామని ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. కాకా నిరంతరం పేదల కోసం కష్టపడే వారని గుర్తు చేశారు. తమ నాన్న ఆశీస్సులతో తమకు ప్రజలకు సేవ చేసే అవకాశం వచ్చిందన్నారు. తాము ఎల్లప్పుడూ నియోజకవర్గ ప్రజలకు అండగా ఉంటామని చెప్పారు.
కాసేపట్లో బాగ్ లింగంపల్లిలోని అంబేద్కర్ ఎడ్యుకేషనల్ ఇన్ స్టిట్యూట్ లో పూర్వవిద్యార్థుల సమ్మేళనం ఉంది. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.