త్వరలో లంబాడా ప్రతినిధుల బృందంతో ఢిల్లీకి

లంబాడీల అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకోవాలన్నారు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకట స్వామి. ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం కొత్తపల్లి సేవాలాల్ దీక్ష భూమి జాతరలో వివేక్ వెంకట స్వామి, మాజీ ఎంపీ రాథోడ్ రమేష్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా మాట్లాడిన వివేక్ వెంకటస్వామి..  కొత్తపల్లి దీక్ష భూమిని టూరిజం పరంగా అభివృద్ధి చేసేందుకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తామన్నారు. త్వరలో లంబాడీ  ప్రతినిధుల బృందంతో ఢిల్లీకి వెళ్లి పలు ఉత్సవాల నిధులు, ప్రభుత్వ హాలిడే కోసం ప్రయత్నం చేస్తామన్నారు. తెలంగాణ బిల్లు పాస్ అయ్యే సమయంలో మాజీ ఎంపీ రాథోడ్ చాలా కృషి చేశారన్నారు. ఉమ్మడి జిల్లాలోని పొడుభూముల సమస్యపై అంతా కలిసి కృషి చేయాలన్నారు.

For More News..

శ్మశానంలో ఫ్రెండ్ బర్త్ డే

రోడ్ల దుస్థితిపై చిన్నారి రిపోర్టింగ్