మంచిర్యాల జిల్లాలో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి పర్యటించారు. మంచిర్యాల పట్టణం గౌతమినగర్లో నిర్వహించిన ఉర్స్ ఇ షరీఫ్ వేడుకలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా బ్యాండ్ కొట్టి అందరినీ అలరించారు. ముస్లింలకు ఉర్స్ ఇ షరీఫ్ శుభాకాంక్షలు చెప్పారు. అనంతరం మంచిర్యాల జిల్లా గద్దెరాగడి అమ్మ గార్డెన్స్ లో జరిగిన ఓ వివాహ వేడుకలో ఆయన పాల్గొన్నారు. వివాహానికి వచ్చిన పార్టీ నాయకులను వివేక్ అప్యాయంగా పలకరించారు.