పెద్దపల్లి, వెలుగు : మంథని నియోజకవర్గం మల్హార్ రావ్ మండలం అన్సాన్ పల్లి గ్రామంలో తీజ్ మహోత్సవం గురువారం ఘనంగా జరిగింది. ఈ వేడుకలకు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి హాజరయ్యారు. గ్రామస్తులు ఆయనకు ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ.. తీజ్ పండుగలో గ్రామస్థులతో కలిసి పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. ఆయనతో పాటు మంథని నియోజకవర్గం ఇన్చార్జి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సునీల్ రెడ్డి, భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు కన్నం యుగదిశ్వర్ తదితరులు పాల్గొన్నారు.