కాంట్రాక్టులన్నీ మేఘా కృష్ణారెడ్డికే : వివేక్ వెంకటస్వామి

సీఎం కేసీఆర్ పై బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి విమర్శలు చేశారు. నెలనెల రూ. 6 వేల కోట్ల అప్పు చేసి ఉద్యోగాలకు జీతాలిస్తుండని ఆరోపించారు. ధర్మపురి పట్టణంలోని SRR గార్డెన్ లో  జేపీ నడ్డ వర్చువల్ మీటింగ్ లో  వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన..  60 వేల కోట్ల అప్పున్న రాష్ట్రాన్ని కేసీఆర్ 5 లక్షల కోట్లకు చేర్చిండని ఆరోపించారు.

ప్రతి గ్రామంలో బెల్టు షాపు పెట్టి  ప్రజలను తాగుబోతులను చేసి ధనిక రాష్ట్రం అంటుండంటూ వివేక్ వెంకటస్వామి సెటైర్లు వేశారు. ఒకప్పుడు 10 వేల కోట్ల మద్యం ఆదాయం ఉంటే.. ఇప్పుడు 40వేల కోట్ల ఆదాయం వస్తుందంటూ కేసీఆర్ గొప్పలు చెబుతుండని విమర్శించారు. తెలంగాణ వచ్చాక అభివృద్ధి పనులేమో కానీ.. కల్వకుంట్ల ఫ్యామిలీ ఆస్తులు మాత్రం పెరిగాయన్నారు.

సీఎం కేసీఆర్ కేవలంలో కాంట్రాక్టర్ల కోసం పనిచేస్తున్నాడని..33 వేల కోట్లతో పూర్తయ్యే కాళేశ్వరం ప్రాజెక్టును లక్ష కోట్లకు పెంచిండని వివేక్ వెంకటస్వామి అన్నారు. కాంట్రాక్టర్లన్నీ మెఘా కృష్ణారెడ్డికే ఇస్తున్నారని.. హైదరాబాద్ లో కాంట్రాక్ట్ లన్నీ ఆయనవేనని ఆరోపించారు. ఈ అవినీతి ప్రభుత్వాన్ని తరిమి కొట్టాలంటే బీజేపీతోనే సాధ్యమన్నారు. దీని కోసం  పార్టీ కార్యకర్తలకు క్షేత్రస్థాయిలో కష్టపడి పనిచేయాలని వివేక్ వెంకటస్వామి సూచించారు.