
చెన్నూరు/జైపూర్(భీమారం)/కోల్‌బెల్ట్, వెలుగు : సింగరేణి మైన్లతో, జైపూర్ లోని సింగరేణి పవర్ ప్లాంట్ లో కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగ నియామకాల్లో 80 శాతం స్థానికులకే అవకాశం ఇచ్చేలా సర్క్యులర్ జారీకి కృషి చేసిన చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్‌వెంకటస్వామికి కోల్బెల్ట్వ్యాప్తంగా గురువారం కృతజ్ఞతలు తెలిపారు. చెన్నూరు, జైపూర్, భీమారంలో, మందమర్రిలోని ఐఎన్టీయూసీ ఆఫీస్, ఇందు గార్డెన్స్, రామకృష్ణాపూర్ కాంగ్రెస్‌పార్టీ ఆఫీసులో వివేక్‌తోపాటు సీఎం రేవంత్‌రెడ్డి ఫొటోలకు క్షీరాభిషేకం చేశారు.