- మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి
- కాంగ్రెస్‌లో చేరిన బీజేపీ లీడర్లు, కార్యకర్తలు
కోల్‌బెల్ట్, వెలుగు : కాకా వెంకటస్వామి జైపూర్‌కు పవర్ ప్లాంట్తెచ్చారని, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే స్థానికులకు అందులో ఉద్యోగాలు కల్పిస్తామని కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి హామీ ఇచ్చారు. కాళేశ్వరం బ్యాక్ వాటర్‌లో మునిగిన పంట పొలాల రైతులకు న్యాయం చేస్తామన్నారు. సోమవారం చెన్నూరు నియోజకవర్గం ఇందారంలోని ఓ ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ మండల ప్రెసిడెంట్, ఇన్చార్జి ఫయాజ్, రిక్కుల శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తల సమావేశానికి వివేక్చీఫ్గెస్ట్గా హాజరయ్యారు.
ఈ సందర్భంగా బీజేపీ మండల ప్రెసిడెంట్చల్లా విశ్వంబర్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నుంచి టేకుమట్ల, నర్సింగపూర్, ఎలుకంటి గ్రామాల సర్పంచులు, నేతలు గోనె నర్సయ్య, జైపాల్ గౌడ్, పండుగ రాజన్న, వెంకన్న, రైతు సమన్వయ కమిటీ అధ్యక్షుడు తిరుపతి రెడ్డి, చెన్నూరు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డితో పాటు మరో 100 మంది కాంగ్రెస్‌లో చేరారు. వీరికి వివేక్ వెంకటస్వామి, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, వివేక్ తనయుడు వంశీకృష్ణ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
కార్యక్రమంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జడ్పీ మాజీ వైస్ చైర్మన్ మూల రాజిరెడ్డి, చేకుర్తి సత్యనారయణ రెడ్డి, పొడేటి రవి, కేవీ ప్రతాప్, భూక్య లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.