చెన్నూరు నుంచి బాల్క సుమన్ ను తరిమి కొట్టాలె: వివేక్ వెంకటస్వామి

తెలంగాణ రాష్ట్రం కోసం ఆనాడు కొట్లాడాం.. రాష్ట్రం ఎందుకివ్వాలో సోనియాగాంధీకి వివరించి ఒప్పించామన్నారు కాంగ్రెస్ నేత వివేక్ వెంకటస్వామి. ప్రజలకోసం కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నాం.. కేసీఆర్ కుటుంబం కోసం కాదు.. ఇప్పుడు కల్వకుంట ఫ్యామిలి రాష్ట్రాన్ని దోచుకుంటుందని వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. ప్రాజెక్టు రీడిజైన్ పేరుతో లక్షల కోట్ల అవినీతి జరిగిందని..కల్వకుంట్ల కమిషన్ రావు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని అన్నారు. కమిషన్ల కోసమే సాగునీటి ప్రాజెక్టులను రీడిజైన్ చేస్తున్నారని అన్నారు వివేక్ వెంకటస్వామి. 

చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ ప్రగతిభవన్ కు బానిస అని.. నియోజకవర్గ ప్రజలకు చేసిందేమీ లేదని అన్నారు వివేక్ వెంకటస్వామి. బాల్క సుమన్ ఇసుక దందాలతో ఏటా రూ. 5వేల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. కాళేశ్వరం బ్యాక్ వాటర్ లో పంటలు మునిగిపోతుంటే బాధిత రైతులకు ఎందుకు నష్ట పరిహారం ఇప్పించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ చిన్న కొడుకు బాల్కసుమన్.. చింతమడక ఇచ్చినట్లు చెన్నూరు కూడా నిధులు తీసుకురావట్లేదని విమర్శించారు. చింతమడకలో అందరికీ దళిత బంధు ఇచ్చిన కేసీఆర్.. చెన్నూరు లో అందరికీ ఎందుకు దళిత బంధు ఇవ్వలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే చెన్నూరు భూదందా పై విచారణ జరిపిస్తామన్నారు.. చెన్నూరు నుంచి బాల్క సుమన్ ను తరిమికొట్టే రోజులు దగ్గరపడ్డాయన్నారు వివేక్ వెంకటస్వామి.  

సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని.. పుట్ట బోయే బిడ్డ పై కూడా రూ. లక్ష అప్పు మోపారని వివేక్ విమర్శించారు. మిగులు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన ఘటన కేసీఆర్ ది అన్నారు. ప్రజలకోసం తెలంగాణ సాధించుకుంటే.. కల్వకుంట్ల ఫ్యామిలీకే నీళ్లు, నిధులు, నియామకాలు దక్కాయని అన్నారు. చింతమడకలో అందరికి దళిత బంధు ఇచ్చి.. చెన్నూరులో ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు వివేక్ వెంకటస్వామి.  

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతామని చెన్నూరు ఎమ్మెల్యే అభ్యర్థి వివేక్ వెంకటస్వామి అన్నారు.