పార్టీ గెలుపు కోసం కలిసికట్టుగా పనిచేయాలి : వివేక్ వెంకటస్వామి

  •    జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి

ధర్మారం, వెలుగు : వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పార్టీ విజయానికి కృషి చేయాలని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ గడ్డం వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు. శుక్రవారం ధర్మారం, వెల్గటూర్​మండలాల్లో పర్యటించారు. ధర్మారం మండలం  కమ్మరిఖాన్ పేట, ధర్మారం, ఖానంపల్లి గ్రామాల్లో బీజేపీ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ గ్రామగ్రామాన పార్టీని బలోపేతం చేసి, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు.

ALSO READ: తుమ్మల రాజీనామా.. సీఎం కేసీఆర్ కు లేఖ

కమ్మరిఖాన్ పేటలో యువతకు గణేశ్​నవరాత్రుల సందర్భంగా ఆర్థిక సాయం అందజేశారు. కార్యక్రమంలో దళితమోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి సూర్యనారాయణ, లీడర్లు గుజ్జుల వేణుగోపాల్ రెడ్డి, మెడవేని శ్రీనివాస్, కస్తూరి సత్యం, భీమారపు సంపత్, రామ్ గోపాల్ రెడ్డి, సంధనవేని లక్ష్మణ్, జంగిలి కిషోర్, దేవి మల్లేశం, మణికంఠ, మహేందర్ రెడ్డి, సతీష్ రెడ్డి, తిరుపతి గౌడ్, కిరణ్, లక్ష్మణ్, దేవి రజినీకాంత్, ప్రసాద్, తిరుపతి, మనోహర్ రెడ్డి, దేవి కిశోర్​పాల్గొన్నారు. 

మోదీని గెలిపిస్తేనే దేశం ముందుకు వెళ్తుంది

వెల్గటూర్ : మోదీని గెలిపిస్తేనే దేశం అభివృద్ధిలో ముందుకు వెళ్తుందని వివేక్ వెంకటస్వామి అన్నారు. సెప్టెంబర్​17న విమోచన దినోత్సవం సందర్భంగా బీజేపీ జెండా ఎగరేసి పోస్ట్ లు పెట్టాలన్నారు. మరోసారి మోదీని గెలిపించేందుకు కార్యకర్తలు సమష్టిగా పనిచేయాలన్నారు. అనంతరం వివిధ గ్రామాలకు చెందిన బాధితులను పరామర్శించారు. ఎండపల్లి మండలం పాత గూడూరులో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో లీడర్లు గాజుల మల్లేశం, ఓరగంటి చంద్రశేఖర్, మర్రిపల్లి సత్యం, మంచి రాజేశ్‌‌‌‌, కొమురెల్లి, గంగారం,కట్ట మహేశ్, శ్రీధర్, లవన్, జనార్దన్, బుద్దే బాబు పాల్గొన్నారు.