
- ఇందారంలో రూ.20లక్షలతో హెల్త్ సబ్ సెంటర్కు శంకుస్థాపన
జైపూర్, వెలుగు: రాష్ట్రంలో విద్య, వైద్య రంగాలకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని చెన్నూర్ ఎమ్మెల్యే డాక్టర్ జి.వివేక్ వెంకటస్వామి అన్నారు. శుక్రవారం ఆయన జైపూర్ మండలం ఇందారంలో రూ.20లక్షలతో హెల్త్ సబ్ సెంటర్ నిర్మాణానికి, కాసింపల్లిలో రూ.4 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నేషనల్ హెల్త్ మిషన్ స్కీమ్ కింద చేపట్టిన సబ్ సెంటర్పనులను ఆరు నెలల్లో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ గణపతి, మెడికల్ ఆఫీసర్ శ్రావ్య, ఎంపీడీఓ సత్యనారాయణ, కాంగ్రెస్ లీడర్లు చల్లా సత్యనారాయణరెడ్డి, ఎండీ ఫయాజ్, రిక్కుల శ్రీనివాస్ రెడ్డి, చల్లా విశ్వంభర్ రెడ్డి, సుంకరి శ్రీనివాస్ పాల్గొన్నారు.
గ్రామాల్లో తాగునీటి సమస్య పరిష్కరిస్తా
భీమారం మండలంలోని పలు గ్రామాల్లో వివేక్ వెంకటస్వామి పర్యటించారు. కొత్తపల్లి గ్రామ యూత్ కాంగ్రెస్ నాయకుడు అన్నమొల్ల అశోక్ సోదరుడు మనోహర్- మాళవిక వివాహ విందులో పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు. మద్దికల్, ఆరెపల్లి, అంకుషాపూర్ గ్రామాల్లో పర్యటించి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆరెపల్లి రోడ్డు నుంచి ఎలికేశ్వరం గ్రామానికి వెళ్లేందుకు బీటీ రోడ్డు నిర్మాణ కోసం నిధులు శాంక్షన్ చేయిస్తానన్నారు. మద్దికల్, కొత్తపల్లి గ్రామాల్లోని పలు కాలనీల్లో పర్యటించి తాగునీటి కోసం బోర్లను వేయించి నీటి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. డ్రైనేజీలు, సిమెంట్ రోడ్ల నిర్మాణం కోసం కృషి చేస్తామని చెప్పారు.
భూకబ్జాపై మహిళల ఫిర్యాదు
భీమారానికి చెందిన బీఆర్ఎస్ లీడర్ చెరుకు సరోత్తమ్రెడ్డి తమ వ్యవసాయ భూములను కబ్జా చేసి గూండాలతో దాడి చేయించాడని ఆరెపల్లికి చెందిన పలువురు మహిళలు, రైతులు ఎమ్మెల్యేకు తమ సమస్యను చెప్పుకున్నారు. అంతకుముందు చెన్నూర్ మండలం అక్కెపల్లికి చెందిన పలువురు మహిళలు పోడు భూముల సమస్యలు పరిష్కరించాలని భీమారంలో వినతిపత్రం అందజేశారు. కాంగ్రెస్ పార్టీ లీడర్లు పొడేటి రవి, భూక్య లక్ష్మణ్, మోహన్ రెడ్డి, వేల్పుల శ్రీనివాస్, కడారి రాజేశ్, వెంకటేశ్వర్లు,రాజమల్లు, శ్యామ్సుందర్రెడ్డి, కనుకయ్య, డేగ రమేశ్ పాల్గొన్నారు. అనంతరం మందమర్రిలోని తవక్కల్హైస్కూల్వార్షికోత్సవానికి వివేక్ హాజరయ్యారు. విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత స్థాయికి
చేరుకోవాలని ఆకాంక్షించారు. మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు పాల్గొన్నారు.