అవినీతి అక్రమాలతో తెలంగాణ సొమ్మును కేసీఆర్ కుటుంబం దోచుకుంటుందని ఆరోపించారు బీజేజీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి. రాష్ట్రంలో ప్రజలు కేసీఆర్ రాక్షస పాలన వద్దంటున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాబోతుందని ధీమా వ్యక్తం చేశారు.
గోదావరిఖనిలో పెద్దపల్లి పార్లమెంట్ ప్రవాస్ యోజన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర పాడి పరిశ్రమ మత్య్స శాఖ మంత్రి పురుషోత్తం రూపాల, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి హాజరయ్యారు. కాసేపట్లో లంచ్ తర్వాత కేంద్రమంత్రి విజయ్ రూపాలతో కలిసి మంథని నియోజకవర్గంలోనూ పర్యటించనున్నారు.