సింగరేణి కార్మికుల సంక్షేమానికి బీజేపీ కృషి: వివేక్ వెంకటస్వామి

సింగరేణి కార్మికుల సంక్షేమానికి బీజేపీ కృషి చేస్తోందని మాజీ ఎంపీ, బీజేపీ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు.పెద్దపల్లి జిల్లా గోదావరిఖని 11వ బొగ్గు గనిపై బీజేపీ ఆధ్వర్యంలో  ఆగస్టు 17న  మీటింగ్​ నిర్వహించారు. 

ఈ కార్యక్రమానికి చీఫ్​ గెస్ట్​గా హాజరైన వివేక్ మాట్లాడుతూ.. సింగరేణి నష్టాల్లో ఉన్నప్పుడు గడ్డం వెంకటస్వామి(కాకా) ఎన్టీపీసీ ద్వారా రుణం తీసుకుని సంస్థ మూలాల్ని బలపరిచినట్లు గుర్తు చేశారు. బీజేపీ కి రాష్ట్రంలో అవకాశం ఇస్తే కార్మికుల ఇన్​కం ట్యాక్స్ మినహాయింపు కోసం చర్యలు చేపడతామని వెల్లడించారు.

ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి పథంలో సాగుతోందని స్పష్టం చేశారు. సింగరేణి ప్రైవేటీకరణ చేస్తున్నారని బీజేపీపై బీఆర్​ఎస్​ నేతలు అసత్య ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. అంతకుముందు సుందిళ్ల లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో వివేక్ ప్రత్యేక పూజలు జరిపించారు.  కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.