
కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన మాట ప్రకారం.. కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను నెరవేరుస్తుందన్నారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. ఆరు గ్యారంటీలను కచ్చితంగా అమలు చేస్తుందని చెప్పారు. అందులో భాగంగా అభయహస్తం దరఖాస్తులకు స్వీకారం చుట్టిందని వివరించారు.
మంచిర్యాల జిల్లాలోని వివిధ మున్సిపాలిటీ కార్యాలయంలో ఆరు గ్యారంటీల అభయహస్తం దరఖాస్తు స్వీకారం కార్యక్రమంలో ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, జిల్లా, రెవెన్యూ అధికారులు అభయ హస్తం దరఖాస్తులను స్వీకరించారు.