డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ నిరంతరం పేద ప్రజలు, దళితుల అభివృద్ధి కోసం పోరాటం చేశారని మాజీ ఎంపీ, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి అన్నారు. దళితులు, బడుగు బలహీన వర్గాల కోసం అంబేద్కర్ చేసిన పోరాటం వెలకట్టలేనిదని చెప్పారు. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అంబేద్కర్ మహోన్నతమైన వ్యక్తి అని వివేక్ వెంకటస్వామి కొనియాడారు. స్వాతంత్రం వచ్చినప్పటికీ దేశంలో వెనుకబడిన వర్గాల అభివృద్ధికోసం అంబేద్కర్ నిరంతరం కృషి చేశారని తెలిపారు. అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర దళిత మోర్చా అధికార ప్రతినిధి కాటే సూర్యనారాయణతో పాటు..పలువురు దళిత సంఘాల నాయకులు, బిజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు.