ఒక్కొక్కరికి రూ.20 కోట్లిచ్చి 20 మంది ఎమ్మెల్యేలను కొన్నడు

కేంద్ర ప్రభుత్వం రా రైస్ కొనడానికి సిద్ధంగా ఉందన్నారు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి. కేంద్రం వడ్లు కొనడం లేదంటూ..కేసీఆర్ అబద్ధాలు ప్రచారం చేస్తున్నాడన్నారు. బాయిల్డ్ రైస్ కోసం కేసీఆర్ మిల్లర్లతో కుమ్మక్కై కేంద్రాన్ని బదనామ్ చేస్తున్నాడన్నారు. కేసీఆర్ మాటలను  ప్రజలు నమ్మడం లేదని.. రాష్ట్రమే వడ్లు కొనాలని రైతులు డిమాండ్ చేస్తున్నారన్నారు. కేసీఆర్ ఒక్కో ఎమ్మెల్యేకు రూ. 20 కోట్లు ఇచ్చి 20 మంది ఎమ్మెల్యేలను కొన్నాడన్నారు. కాళేశ్వరానికి కేటాయించిన లక్ష కోట్లతో పేదలకు డబల్ బెడ్ రూమ్ ఇండ్లు వచ్చేవన్నారు. ఒడిపోయిన బిడ్డకు ఎమ్మెల్సీ, మందులు ఇస్తున్న సంతోష్ కు ఎంపీ పదవి ఇచ్చి ఉద్యమకారులకు కేసీఆర్ అన్యాయం చేశారన్నారు. సిరిసిల్లలోని  వేమనపల్లి మండల కేంద్రంలో ఇటీవల   గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో బాధిత కుటుంబాన్ని పరామర్శించి రూ. 10 వేలు ఆర్థికసాయం  అందజేశారు. ఈ సందర్భంగా పలువురు యువకులకు పార్టీ కండువా కప్పి బీజేపీలోకి ఆహ్వానించారు.

ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ కప్ ఆసీస్‎దే