కోల్ బెల్ట్,వెలుగు: తొమ్మదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని చెన్నూర్కాంగ్రెస్అభ్యర్థి వివేక్ వెంకటస్వామి సతీమణి సరోజ అన్నారు. శుక్రవారం వివేక్తరుపున ఆమె మందమర్రిలోని 9వ వార్డులో జడ్ప చైర్ పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మితో కలిసి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అందుబాటులో లేని ఎమ్మెల్యే బాల్క సుమన్ ను ఎన్నుకొని ప్రజలు అరిగోస పడుతున్నారని మండిపడ్డారు. కాకా వెంకటస్వామి ఆశయాలను వారి కుమారులు వినోద్, వివేక్ వెంకటస్వామి కొనసాగిస్తున్నారని, వారికి ఎల్లప్పుడూ మీ అశీస్సులు ఉండాలన్నారు.
అధికారంలో లేకున్నా వివేక్ వెంకట స్వామి ప్రజా సేవలోనే ఉన్నారని తెలిపారు. బీఆర్ఎస్ ను నమ్మి ఓటేస్తే చేసిందేమీ లేదన్నారు. తనను ఎవరేం చేస్తరులే అనే పొగరుతో సుమన్ ఉన్నాడని, ఓడించి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఇంటింటికీ తిరుగుతూ వివేక్ వెంకటస్వామి ని గెలిపించాలని కోరారు. ఆమె వెంట మంద తిరుమలరెడ్డి, గడ్డం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.