పెద్దపల్లి జిల్లా: పెట్రోల్, గ్యాస్, డీజిల్ జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి అన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో మాట్లాడారు. ఆర్టీసీ చార్జీలు, మద్యం ధరలు ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలోని అధికమన్నారు.
పెద్దపల్లి జిల్లాలో బీఆర్ఎస్ నాయకులు ఇసుకను అక్రమంగా దోచుకుంటున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక తుగ్లక్ అని విమర్శించారు. ఓదెల మండల ప్రజల కోరిక మేరకే కేంద్ర రైల్వే మంత్రితో మాట్లాడి రైలు ఆగేలా చేయించానన్నారు.