
కోల్బెల్ట్: రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు అయ్యాక ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి నుంచే కేసీఆర్ పై పోరాటం చేయడం ప్రారంభించారని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. ఇవాళ ఇంద్రవెల్లిలో సీఎం రేవంత్రెడ్డి పర్యటన నేపథ్యంలో విలేకరులతో ఎమ్మెల్యే వివేక్ మాట్లాడారు. ఇంద్రవెల్లి లో దళిత గిరిజన పోరుబాట బహిరంగ సభతో బీఆర్ఎస్ ప్రభుత్వంపై రేవంత్ రెడ్డి పోరాటం ప్రారంభించారన్నారు.
ఇక్కడ నుంచి స్టార్ట్ అయిన ఉద్యమం కారణంగానే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందన్నారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల కోసం మళ్లీ ఇక్కడి నుంచే కాంగ్రెస్ పార్టీ సమర శంఖారావం పూరిస్తున్నదని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో రాహుల్ గాంధీ ని ప్రధానిని చేయడం కోసం కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులందరం కలిసి సైనికుల్లా పోరాటం చేద్దామని ఆయన పిలుపునిచ్చారు.