చెన్నూరులో స్కిల్ డెవ్లప్మెంట్ సెంటర్ : వివేక్ వెంకటస్వామి

చెన్నూరులో స్కిల్ డెవ్లప్మెంట్ సెంటర్ : వివేక్ వెంకటస్వామి

త్వరలో చెన్నూరులో స్కిల్ డెవ్ లప్ మెంట్ సెంటర్ ను ప్రారంభించి యువతకు ఉద్యోగాలిప్పిస్తామని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి  అన్నారు. టేకుమట్ల గ్రామంలో సింగరేణి ఆధ్వర్యంలో కమ్యూనిటీ హాల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. కాకా వెంకటస్వామి  ఎంపీగా ఉన్నపుడే సింగరేణి సంస్థ బీఏఎఫ్ ఆర్ లోకి వెళ్లిందన్నారు.  బీఏఎఫ్ ఆర్ నుంచి సంస్థను  తొలగించడానికి అప్పటి ప్రధానితో మాట్లాడి సంస్థకు 400 కోట్లు ఇప్పించారని చెప్పారు.  సింగరేణి కార్మికులు చాలా కష్టపడి పనిచేస్తారని చెప్పారు  సింగరేణి గనుల్లో ,పవర్ ప్లాంట్ లో 80 శాతం స్థానికులకే  ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నారు. ఇందారం, రామారావు పేట గ్రామాల్లో యువతకు మినీ స్టేడియంను ఏర్పాటు  చేసి ఆటలను ప్రోత్సహిస్తామని చెప్పారు.

అంతకుముందు  జైపూర్ మండలంలోని వేలాల మల్లన్న గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు  చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి..ఆలయ అధికారులు ఆయనకు ఘనస్వాగతం పలికారు.  అనంతరం  వెలాల గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయితీ భవనాన్ని ప్రారంభించారు.     ఈ కార్యక్రమంలో  జిల్లా జెడ్పీ చైర్ పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే ఓదెలు, జిల్లా పంచాయతీ అధికారి స్థానిక సర్పంచ్ పాల్గొన్నారు...