ఉప ఎన్నికలు ఉన్నప్పుడే ఫామ్ హౌస్ నుంచి కేసీఆర్ బయటకొస్తరు

సాధారణ ఎన్నికల  ముందు ప్రీ ఫైనల్ ఎన్నికగా మునుగోడు ఉప ఎన్నికను భావిస్తున్నామని ఉప ఎన్నిక కమిటీ చైర్మన్ వివేక్ వెంకటస్వామి అన్నారు. ఉప ఎన్నికలు ఉన్నప్పుడే సీఎం కేసీఆర్ .. ఫామ్ హౌస్ నుంచి బయటకు వస్తారని చెప్పారు. హుజురాబాద్ ఉప ఎన్నిక సమయంలో దళిత బంధు, ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా గిరిజన బంధు ఇస్తానని అంటున్నారని మండిపడ్డారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి కేసీఆర్ ను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని చెప్పారు. హుజురాబాద్ ఉప ఎన్నిక సందర్భంగా దళిత బంధు అమలు చేస్తామని చెప్పి.. ఆ హామీని అమలు చేయలేదన్నారు. ఇప్పుడు గిరిజన బంధు ఎలా అమలు చేస్తారని ప్రశ్నించారు. మునుగోడు ఉపఎన్నిక గెలుపుపై  కమిటీ సమావేశంలో చర్చించామని వివేక్ వెంకట స్వామి చెప్పారు. కమిటీ సభ్యులు సలహాలు, సూచనలు ఇచ్చారని అన్నారు. మునుగోడు ఉప ఎన్నికను బీజేపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందన్నారు. ఉప ఎన్నిక కోసం ఛార్జ్ షీట్ తో పాటు మ్యానిఫెస్టోను కూడా విడుదల చేస్తామని చెప్పారు. 

మునుగోడు ఉప ఎన్నికను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఉప ఎన్నికలో గెలిచి సత్తా చాటి.. పార్టీ శ్రేణుల్లో జోష్ నింపాలని ముందుకెళ్తోంది. ఈ క్రమంలోనే మునుగోడు నియోజకవర్గంపై బీజేపీ ప్రత్యేక దృష్టి పెట్టింది. మునుగోడు ఉప ఎన్నిక కమిటీ చైర్మన్ వివేక్ వెంకటస్వామి.. బీజేపీ మండల ఇన్ చార్జ్ లతో పాటు సహ ఇన్ చార్జ్ లను నియమించారు. 

చౌటుప్పల్ మండలం 
ఇన్ చార్జ్                   :  కూన శ్రీశైలం గౌడ్, మాజీ ఎమ్మెల్యే
సహ ఇన్ చార్జ్         :   జిట్టా బాలకృష్ణా రెడ్డి
సహ ఇన్ చార్జ్         :  కె రాములు, జాతీయ ఎస్సీ కమిషన్ మాజీ సభ్యులు

చౌటుప్పల్ మున్సిపాలిటీ
ఇన్ చార్జ్                 :  రేవూరి ప్రకాశ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే
సహ ఇన్ చార్జ్       :  సుభాష్ చందర్ జీ, జీహెచ్ఎంసీ మాజీ డిప్యూటీ మేయర్ 
సహ ఇన్ చార్జ్       :  కర్నాటి ధనుంజయ

నారాయణపూర్ మండలం
ఇన్ చార్జ్                :  రఘునందన్ రావు, దుబ్బాక ఎమ్మెల్యే
సహ ఇన్ చార్జ్      :  రమేష్ రాథోడ్, మాజీ ఎంపీ
సహ ఇన్ చార్జ్      :  కాసం వెంకటేశ్వర్లు, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు

మునుగోడు మండలం 
ఇన్ చార్జ్               :   చాడ సురేష్ రెడ్డి, మాజీ ఎంపీ
సహ ఇన్ చార్జ్      :   బొడిగే శోభ, మాజీ ఎమ్మెల్యే 
సహ ఇన్ చార్జ్      :   రవికుమార్ యాదవ్ 

చండూర్ మండలం
ఇన్ చార్జ్              :  టీ. నందీశ్వర్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే
సహ ఇన్ చార్జ్     :  వన్నాల శ్రీరాములు, మాజీ ఎమ్మెల్యే 
సహ ఇన్ చార్జ్     :  అందె బాబయ్య

చండూర్ మున్సిపాలిటీ 
ఇన్ చార్జ్               :  ఎం ధర్మారావు, మాజీ ఎమ్మెల్యే 
సహ ఇన్ చార్జ్     :  ఎం. విజయ్ పాల్, మాజీ ఎమ్మెల్యే 
సహ ఇన్ చార్జ్     :   నాగురావ్ నాంజీ

నాంపల్లి మండలం 
ఇన్ చార్జ్                 :  ఏనుగు రవీందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే 
సహ ఇన్ చార్జ్       :  అందె శ్రీరాములు యాదవ్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు 
సహ ఇన్ చార్జ్       :  రితేష్ రాథోడ్

మర్రిగూడెం మండలం
ఇన్ చార్జ్                 :  కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మాజీ ఎంపీ
సహ ఇన్ చార్జ్       :  ఎర్రబెల్లి ప్రదీర్ రావు
సహ ఇన్ చార్జ్       :  తుల ఉమ