
- కేసీఆర్ అహంకారాన్ని దించుడే
- ఇదే కరెక్ట్ టైం
- మేం అధికారంలోకి వస్తే పేదల రాజ్యం వస్తది
- మహిళలందరికీ బస్సుల్లో ఫ్రీ జర్నీ
- చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి
కోల్ బెల్ట్: సీఎం కేసీఆర్ అహంకారాన్ని దించేందుకు ఇదే కరెక్ట్టైం అని చెన్నూరు కాంగ్రెస్అభ్యర్థి వివేక్వెంకటస్వామి అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్అధికారంలోకి వస్తే పేదల రాజ్యం వస్తుందన్నారు. బాల్క సుమన్ ఇసుక దందా మీద వేల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం టేకుమట్లలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు.
‘సింగరేణి డబ్బులను కేసీఆర్ కుటుంబం వారి నియోజకవర్గాలకు తీసుకెళ్తోంది. కాళేశ్వరం పేరుతో కేసీఆర్లక్షకోట్లు మింగిండు. కాళేశ్వరం బ్యాక్ వాటర్ తో పంటలు మునిగిపోయినయ్. కాంగ్రెస్ పవర్లోకి రాగానే రూ.500కే గ్యాస్ సిలిండర్, మహిళలందరికీ బస్సుల్లో జర్నీ ఫ్రీగా కల్పిస్తం. ఇక్కడ బాల్క సుమన్ చేసేందేమీ లేదు. చెన్నూరు నియోజకవర్గంలో మైనింగ్ ఇనిస్టిట్యూట్ తీసుకొచ్చి.. ఉద్యోగాలు కల్పించే బాధ్యత నాదే. జైపూర్ లో స్థానిక యువతకు ఉద్యోగ అవకాశం ఇవ్వాలనే సోయి లేనోడు బాల్క సుమన్. మేము అధికారంలోకి వచ్చాక స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్త’ అని వివేక్ హామీ ఇచ్చారు.