మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట : వివేక్ వెంకటస్వామి

  • ఎమ్మెల్యేగా గెలిచి.. ప్రజలకు అండగా ఉంటా 

కోల్ బెల్ట్,వెలుగు:  మైనార్టీల సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ పెద్ద పీట వేస్తుందని, కాకా వెంకటస్వామి హయాం నుంచి తమ కుటుంబానికి వారితో మంచి అనుబంధం ఉందని చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి అన్నారు. శుక్రవారం క్యాతనపల్లి మున్సిపాలిటీ లోని రామకృష్ణపూర్ ఏ-జోన్ మాజిద్​లో ముస్లింలు, సీఎస్ఐ చర్చిలో క్రైస్తవులను మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలుతోపాటు కలిశారు. ఈ సందర్భంగా మైనార్టీల సమస్యలను తెలుసుకున్నారు.   బాల్క సుమన్ కు తమ సమస్యలు కనీసం వినేందుకు టైం ఇవ్వలేదని, ఇంటికి వెళ్లినా కలిసేవాడు కాదని మైనార్టీలు ఆవేదన చెందారు.  

తమ వృత్తి, తమ సామాజిక వర్గాన్ని కించపరిచేలా మాట్లాడేవారని  అన్నారు. అనంతరం వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ... కాకా వెంకట స్వామికి ముస్లిం, క్రైస్తవ సోదరులతో మంచి అనుబంధం ఉండేదని అదే సంప్రదాయాన్నీ  తమ కుటుంబం  కొనసాగిస్తుందని పేర్కొన్నారు.  రానున్న ఎన్నికల్లో తనకు అండగా నిలవాలని కోరారు. చెన్నూర్ లో ఎమ్మెల్యేగా గెలిచి, మైనార్టీల విద్య, ఉపాధి, ఉద్యోగాలు అందించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.  ఈ సందర్భంగా వివేక్ వెంకటస్వామి, నల్లాల ఓదెలును వారు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ స్టేట్ ప్రెసిడెంట్ వాసిరెడ్డి సీతారామయ్య, లీడర్లు అబ్దుల్ అజిజ్, అక్బర్ అలీ, యాకుబ్ అలీ, ఖాజా షరీఫ్, దేవనందం   పాల్గొన్నారు.

 కాంగ్రెస్ లో పలువురి చేరిక..

 మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణానికి చెందిన బీఆర్ఎస్ మహిళా విభాగం జిల్లా జనరల్ సెక్రెటరీ మేకల ప్రమీల..   వివేక్ వెంకటస్వామి సమక్షంలో శుక్రవారం కాంగ్రెస్ లో చేరారు. వారికి వివేక్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ప్రమీల  మాట్లాడుతూ... 2016 నుంచి మంచిర్యాల జిల్లా మహిళా విభాగం జనరల్ సెక్రెటరీగా  పార్టీకి సేవలందించానని అన్నారు. కానీ ఎమ్మెల్యే బాల్క సుమన్ తన సేవలను గుర్తించని కారణంగా బీఆర్ఎస్ ను వీడినట్టు చెప్పారు. మరోవైపు రామకృష్ణపూర్ కు చెందిన పలువురు మైనార్టీలు, యూత్ వివేక్ వెంకటస్వామి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు.

ఇసుక దందా లో బాల్క సుమన్ కోట్లు కొల్లగొట్టాడు: 

జైపూర్ మండలంలోని  గంగిపల్లి, వేలాల గ్రామాల్లో వివేక్ వెంకటస్వామి శుక్రవారం రాత్రి   ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వివేక్ ప్రచారానికి గ్రామస్థులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగ వేలాల లోని ప్రముఖ  దేవాలయం మల్లికార్జున స్వామి ని దర్శించుకున్నారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కాళేశ్వరం లో కేసీఆర్  రూ. 70 వేల కోట్ల కమిషన్లు దండుకుంటే,  బాల్క సుమన్ ఇసుక దందా లో వేయి కోట్లు  కొల్లగొట్టారని అన్నారు.  ఈ ప్రచారంలో  గంగిపల్లి సర్పంచ్ పాలమాకుల లింగా రెడ్డి,ఉప సర్పంచ్ రాజి రెడ్డి , నాయకులు వెంకట్ రెడ్డి  శ్రీనివాస్ రెడ్డి, చిన్నయ్య ,కన్నయ్య, కో అప్షన్ లు రిక్కుల వెంకట్ రెడ్డి ,శీలం వెంకటేష్ మాజీ మండల వైఎస్ ప్రెసిడెంట్ రాజీ రెడ్డి, వేలాల సర్పంచ్ ప్యాగ శ్యామల లక్ష్మణ్, ఎం పీ టీ సీ  రాజేశ్వరి రాజ బాబు  పాల్గొన్నారు.