తెలంగాణలో కాంట్రాక్టు కార్మికులు ఉండరని చెప్పిన కేసీఆర్..మాటతప్పారన్నారు బీజేపీ జాతీయ కార్యవర్గం సభ్యులు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి. రాష్ట్రం ఏర్పడినపుడు 64వేల మంది కార్మికులు ఉంటే..ప్రస్తుతం 42వేల కార్మికులే ఉన్నారన్నారు. కోల్ ఇండియా కార్మికులు పొందే అన్ని బెనిఫిట్స్ సింగరేణి కార్మికులకు అందించాలని డిమాండ్ చేశారు. సింగరేణిని ప్రైవేట్ చేసే ఆలోచన కేంద్రానికి లేదన్నారు మాజీ ఎంపీ వివేక్ వేంకట స్వామి. సింగరేణి సొమ్మును దోచుకోవడానికే కేసీఆర్..సీఎండీగా శ్రీధర్ ను ఇంకా పదవిలో కొనసాగిస్తున్నారన్నారు.
పంజాబ్ రైతులను మించిన ఉద్యమం చేస్తాం
అమ్మో నిమ్మా! భారీగా పెరిగిన ధరలు