రోగులకు పండ్లు పంచిన కాంగ్రెస్​ శ్రేణులు

రోగులకు పండ్లు పంచిన కాంగ్రెస్​ శ్రేణులు

ఘనంగా ఎమ్మెల్యే వివేక్-సరోజ దంపతుల వివాహ వార్షికోత్సవం

కోల్​బెల్ట్/చెన్నూర్, వెలుగు: చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి-సరోజ దంపతుల వివాహ వార్షికోత్సవాన్ని కాంగ్రెస్​ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. గురువారం చెన్నూరు పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రిలోని రోగులకు పండ్లు పంపిణీ చేశారు. పార్టీ సీనియర్ ​లీడర్​ హేమవంత్​రెడ్డి ఆధ్వర్యంలో పంచముఖ హనుమాన్ ​ఆలయంలో ఎమ్మెల్యే వివేక్​దంపతుల పేరిట ప్రత్యేక పూజలు చేశారు.

ఈ కార్యక్రమంలో లీడర్లు హేమంత్​రెడ్డి, చీర్ల సుధాకర్​రెడ్డి, బాపగౌడ్, ఈర్ల నారాయణ, నాగరాజు, లచ్చన్న, తిరుపతిరెడ్డి, మధు తదితరులు పాల్గొన్నారు. క్యాతనపల్లి మున్సిపాలిటీలో యూత్​ కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. గద్దెరాగడిలో యూత్​ కాంగ్రెస్ ​టౌన్​ ప్రెసిడెంట్​ మోకనపల్లి రామకృష్ణ ఆధ్వర్యంలో కేక్​కట్​ చేసి సంబురాలు చేసుకున్నారు.