నీటి ఎద్దడి తీర్చేందుకు వందల బోర్లు వేశాం : వివేక్​ వెంకటస్వామి

  •     విశాక ట్రస్టు, వెంకటస్వామి ఫౌండేషన్ ​ద్వారా సేవలు
  •     ఐదేండ్లలో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా
  •     చెన్నూరు ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి

కోల్​బెల్ట్/చెన్నూరు/జైపూర్, వెలుగు: చెన్నూరు నియోజకవర్గంలో నీటి ఎద్దడి తీర్చడానికి విశాక ట్రస్టు, వెంకటస్వామి ఫౌండేషన్​ ద్వారా వందలాది బోర్లను వేశామని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి అన్నారు. పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ తరఫున వివేక్​ ఆధ్వర్యంలో సోమవారం రాత్రి చెన్నూరు పట్టణంలో పలు కాలనీల్లో ఎన్నికల కార్నర్​ మీటింగ్​లు, ఎంఆర్​ఆర్​ గార్డెన్స్​లో నేతకానీ కుల సంఘం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వివేక్ వెంకటస్వామి​ మాట్లాడుతూ.. ఎమ్మెల్యేగా ఐదేండ్లలో చెన్నూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసితీరుతానన్నారు. బీజేపీ హయాంలో నిత్యావసరాల ధరలు పెంచి పేదల నడ్డి విరిచిందని మండిపడ్డారు. పదేండ్లలో బీజేపీ అమలు చేసిన ఒక్క స్కీం కూడా ప్రజలకు అందలేదన్నారు. కాంగ్రెస్​ అభ్యర్థి వంశీకృష్ణను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. 

వివేక్, వంశీకృష్ణ సమక్షంలో చేరికలు

కాంగ్రెస్ ​ఎన్నికల కార్నర్ ​మీటింగుల సందర్భంగా పలువురు బీజేపీ, బీఆర్ఎస్ ​మాజీ ప్రజాప్రతినిధులు, లీడర్లు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వివేక్​ వెంకటస్వామి, వంశీకృష్ణ సమక్షంలో కాంగ్రెస్​లో చేరారు.  వేమనపల్లి మండల బీజేపీ ప్రెసిడెంట్ బైసా​మల్లేశ్​కాంగ్రెస్​లో ​చేరగా ఆయనకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. చెన్నూరు మండలంలోని దుగ్నెపల్లి, సుందరశాల, నర్సక్కపేట, పాగెపల్లి, ముత్తరావుపల్లి, పొక్కూర్, రచ్చపల్లి, కొమ్మెర, చెన్నూరు పట్టణంలోని ఎంఆర్ఆర్​ గార్డెన్స్, మహంకాళి వాడ, జెండావాడలో కాంగ్రెస్​ కార్నర్​ మీటింగ్​లు జరిగాయి.

ఈ సందర్భంగా పలు పార్టీలకు చెందిన నేతలు కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు.ఈ మీటింగుల్లో మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్, జడ్పీ మాజీ వైస్​ చైర్మన్​మూల రాజిరెడ్డి, నేతలు బాపురెడ్డి, హిమవంతరెడ్డి, మైదం రవి, బండి సదానందం, భాస్కర్​రెడ్డి, సుశీల్, అంకాగౌడ్, రఘునందన్​ రెడ్డి, మహమ్మద్ ఖలీల్, షాబీర్​అలీ, సంతోష్, దర్శనాల రమేశ్, పొడేటి రవి, భూక్య తిరుమల లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. 

స్టేట్​ర్యాంకర్​ను అభినందించిన ఎమ్మెల్యే

చెన్నూరు మండలం పొక్కుర్​ గ్రామానికి చెందిన ఇంటర్​విద్యార్థిని చీర్ల సాయిజను ఎమ్మెల్యే వివేక్​అభినందించారు. ఇటీవల విడుదలైన ఇంటర్​ఫస్టియర్​ఫలితాల్లో సాయిజ ఎంపీసీలో స్టేట్​ఫస్ట్​ర్యాంక్​ సాధించింది. ఈ సందర్భంగా సాయిజను సన్మానించిన వివేక్.. ప్రోత్సాహకంగా రూ.25వేలు ప్రకటించారు.