వంశీకృష్ణను గెలిపిస్తే యువతకు ఉద్యోగాలు : వివేక్​వెంకటస్వామి

  • జోరుగా కాంగ్రెస్​శ్రేణుల ప్రచారాలు

కోల్​బెల్ట్, వెలుగు:పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను గెలిపిస్తే నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు కృషి చేస్తారని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి అన్నారు. శుక్రవారం మంచిర్యాల హైటెక్​ సిటీలోని ఎమ్మెల్యే ఇంట్లో నిర్వహించిన కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు. మందమర్రి మండలానికి చెందిన కురుమ సంఘం లీడర్, బీఆర్ఎస్​ రాష్ట్ర మాజీ సెక్రటరీ గుంట శ్రీశైలం, క్యాతనపల్లి మున్సిపాలిటీకి చెందిన బీఆర్ఎస్ ​లీడర్​ గోపు రాజం తదితరులు వివేక్​సమక్షంలో కాంగ్రెస్​లో చేరారు.

వంశీకృష్ణ తరఫున ప్రచారాలు

మందమర్రి, క్యాతనపల్లి మున్సిపాలిటీల్లోని వార్డుల్లో  వంశీకృష్ణ తరఫున కాంగ్రెస్​ శ్రేణులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మందమర్రి టౌన్​ కాంగ్రెస్ ప్రెసిడెంట్​నోముల ఉపేందర్​ గౌడ్, క్యాతనపల్లి టౌన్, బ్లాక్​ ప్రెసిడెంట్లు పల్లె రాజు, గోపతి రాజయ్య నేతృత్వంలో ప్రచారాలు చేపట్టారు. కాంగ్రెస్​ఆరు గ్యారంటీలపై ప్రజలకు వివరిస్తూ వంశీకృష్ణను ఎంపీగా గెలిపించాలని కోరారు.

కాంగ్రెస్ ఇన్​చార్జి కడారి జీవన్​కుమార్​ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించి అందుగులపేటలో ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ పంపిణీ చేశారు. భీమారం మండల కాంగ్రెస్ లీడర్లు నర్సింగాపూర్​లో ఉపాధి హామీ కూలీల వద్దకు చేరుకొని కాంగ్రెస్​ పథకాలను వివరించారు. లీడర్లు పెద్దల రూపాబాపు, దుర్గం మల్లేశ్, పొడేటి రవి, జడ్పీటీసీ భూక్య తిరుమల లక్ష్మణ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.