- గ్రామాల్లోని జనం సుమన్ మిస్సింగ్ అంటున్రు
కోల్‌బెల్ట్/జైపూర్, వెలుగు: చెన్నూరు నియోజకవర్గం మండలాలు, గ్రామాలకు ప్రచారానికి పోతే ఎమ్మెల్యే సుమన్ మిస్సింగ్ అని జనాలు అంటున్నారని కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి అన్నారు. శనివారం రాత్రి క్యాతనపల్లి మున్సిపాలిటీలోని 19 వార్డు శ్రీనివాస్ నగర్ పోచమ్మ ఆలయం ఏరియాలో నిర్వహించిన కాంగ్రెస్ చేరిక సభకు ఆయన హాజరయ్యారు. బాల్క సుమన్‌కు చిత్తశుద్ధి, సోయి ఉంటే నీళ్ల సమస్య, రోడ్ల సమస్య, అభివృద్ది పనులు ఇన్ టైంలో పూర్తయ్యేవన్నారు.
తాను ఎంపీగా ఉన్నప్పుడు మంచిర్యాల- రామకృష్ణాపూర్ ప్రధాన రహదారిలోని క్యాతనపల్లి రైల్వే గేటు వద్ద రైల్వే ఆర్వో బ్రిడ్జి కోసం రూ.42 కోట్లు మంజూరు చేసినట్లు చెప్పారు. పదేండ్లు గడిచినా ఆర్వో బ్రిడ్జిని బాల్క సుమన్ పూర్తి చేయించలేకపోయాడని విమర్శించారు. వివేక్ వెంకటస్వామిని గెలిపించుకుంటామని వైఎస్సార్‌తెలంగాణ పార్టీ లీడర్లు పేర్కొన్నారు. పార్టీ పిలుపు మేరకు మందమర్రిలో మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలును కలిసి కాంగ్రెస్అభ్యర్థికి మద్దతు ప్రకటించారు. వైఎస్సార్టీపీ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు షేక్ అజీమొద్దీన్, సుద్దాల ప్రభుదేవ్ పాల్గొన్నారు.
కాంగ్రెస్‌లో చేరికలు
వివేక్ వెంకటస్వామి సమక్షంలో జైపూర్మండలంలో బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్‌లో చేరారు. పార్టీలో చేరిన వారిలో రామారావుపేట, ఇందారం నేతలు రిక్కుల శ్రీనివాస్ రెడ్డి, బీఆర్ఎస్కు చెందిన మాజీ ఉప సర్పంచ్ బొద్దున జగ్గయ్య, ఇందారం కో ఆప్షన్ మెంబర్ జైనోద్దిన్, వార్డ్ మెంబర్లు ఎస్కే షరీఫ్, సాయి కృష్ణ, మాజీ ఎంపీటీసీలు సుంకరి శ్రీనివాస్, పులి లక్ష్మి, మాజీ సర్పంచ్ గడ్డం శారద, మరో 200 మంది కాంగ్రెస్‌లో చేరారు.
భీమారం మండల కేంద్రానికి చెందిన సీనియర్ లీడర్లు పొడేటి రవి, భూక్య లక్ష్మణ్ ఆధ్వర్యంలో పెరుక సంఘం సభ్యులు సందెల తిరుపతి, కొట్టె సంతోష్, సూరం సంపత్, శ్రవణ్, కందుల శ్రీను, శ్యాం తదితరులు హస్తం పార్టీలో చేరారు. మందమర్రి పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు నివాసం వద్దచేరికల కార్యక్రమంలో వివేక్‌వెంకటస్వామి, ఓదెలు ఆధ్వర్యంలో క్యాతనపల్లి మున్సిపాలిటీ పట్టణ బీజేపీ ఉపాధ్యక్షుడు సంఘ రవి, ఆయన సతీమణి, జిల్లా సెక్రటరీ సంఘ సాగరికతోపాటు బీఆర్ఎస్, బీఎంఎస్పార్టీల నుంచి కాంగ్రెస్‌లో చేరారు.