నాగర్ కర్నూల్, వెలుగు: సీఎం కేసీఆర్ మాటలు నమ్మి, మళ్లా ఓటేస్తే గోసపడ్తామని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి అన్నారు. ‘‘ఎలక్షన్లు వస్తున్నాయంటేనే కేసీఆర్ బయటకు వస్తారు. పాత హామీల జోలికి పోకుండా కొత్త ముచ్చట చెప్తారు. మోసపోయి ఓట్లేస్తే మళ్లీ ఐదేండ్లు గోసపడ్తాం. వచ్చే ఎన్నికల్లో కారును పంక్చర్ చేయాలి. డబుల్ ఇంజన్ సర్కార్ తెచ్చుకోవాలి” అని ప్రజలకు పిలుపునిచ్చారు. మంగళవారం నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం పెంట్లవెల్లిలో ‘ప్రజా గోస–బీజేపీ భరోసా’ కార్నర్ మీటింగ్‌లో వివేక్ మాట్లాడారు. ‘‘ఇంటికొక ఉద్యోగం ఇస్తానన్న కేసీఆర్.. తన కొడుకు, బిడ్డ, అల్లుడు, సడ్డకుని కొడుకుకు తలా ఒక ఉద్యోగం ఇచ్చి నెలకు రూ.25 లక్షల జీతం ఇస్తున్నారు. అందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టిస్తానని చెప్పి.. బుల్లెట్ ప్రూఫ్ గోడలున్న 100 బెడ్ రూమ్స్ తో ప్రగతి భవన్ కట్టుకున్నారు. హైదరాబాద్ పరిసరాల్లో 20 వేల ఎకరాలు సంపాదించిన కేసీఆర్.. పేదలకు గజం భూమి కూడా పంచలేదు. వేల ఎకరాల్లో ఆయన కొడుకు, బిడ్డ ఫామ్ హౌస్‌లు కట్టుకున్నారు” అని మండిపడ్డారు. పీఎం ఆవాస్ యోజన కింద కేంద్రం నిధులిస్తే, వాటిని కమీషన్ల కోసం ప్రాజెక్టులకు డైవర్ట్ చేశారని ఆరోపించారు.
కేసీఆర్ మాటలు నమ్మి, మళ్లా ఓటేస్తే గోసపడ్తం:వివేెక్ వెంకటస్వామి
- మహబూబ్ నగర్
- February 22, 2023
లేటెస్ట్
- ఎల్ఆర్ఎస్ అప్లికేషన్లకు మోక్షమెప్పుడో?
- రైల్వే సిగ్నలింగ్ వ్యవస్థను మెరుగుపరచాలి : ఐఐటీ మద్రాస్ ప్రొఫెసర్ డాక్టర్ రాధాకృష్ణ
- రియాక్టర్ పేలిన ఘటనలో.. మరో కార్మికుడు మృతి
- ఆలు సాగు మరింత భారం
- సమగ్ర సర్వే వివరాల డేటా ఎంట్రీ కీలకం: భట్టి
- దుందుభి నదిలో అరుదైన చేపలు
- వరంగల్ లో హడలెత్తిస్తున్న దొంగతనాలు
- ఎన్టీపీసీకి నాలుగు అవార్డులు
- వడ్ల దిగుబడి దేశంలోనే రికార్డు: ఉత్తమ్
- ఆలయ అభివృద్ధికి ఎంపీ ఫండ్స్ కేటాయిస్తా: ఎంపీ వంశీకృష్ణ
Most Read News
- వారఫలాలు (సౌరమానం) నవంబర్ 24 నుంచి నవంబర్ 30వరకు
- IPL 2025 Mega Action: వేలంలో SRH తొలి రోజు కొనుగోలు చేసిన ఆటగాళ్లు వీరే
- IPL Auction 2025 Live Updates: ఐపీఎల్ మెగా వేలం 2025.. లైవ్ అప్డేట్స్
- ముగిసిన తొలి రోజు IPL మెగా వేలం.. వార్నర్‌తో సహా అమ్ముడుపోని ప్లేయర్స్ వీళ్లే
- ఈ విషయం ఇన్నాళ్లు తెలియలేదే.. టీవీ రిమోట్‌తో ఇలా కూడా చేయొచ్చా..?
- Virat Kohli: కెరీర్లో 81వ శతకం.. బ్రాడ్‌మన్‌ను దాటేసిన విరాట్ కోహ్లీ
- ఆర్సీబీ అభిమానులకు ఊరట.. జట్టులోకి విధ్వంసకర ఓపెనర్
- చిక్కుల్లో సినీ నటుడు అలీ.. ఫామ్ హౌస్ కట్టుకోవడంలో తప్పు లేదు.. కానీ..
- Syed Mushtaq Ali Trophy: సన్ రైజర్స్ వద్దనుకుంది.. సెంచరీతో మ్యాచ్ గెలిపించాడు
- IPL Auction 2025: 19 ఏళ్ల స్పిన్నర్ కోసం రూ.10 కోట్లు.. చెన్నై నిర్ణయం సరైనదేనా..?