కేసీఆర్ కు రోజులు దగ్గర పడ్డయ్

కేసీఆర్ కు రోజులు దగ్గర పడ్డయ్

కేసీఆర్ ఆదేశాల మేరకే బండి సంజయ్ పై దాడి చేశారని GHMC ఎన్నికల నిర్వహణ కమిటీ జాయింట్ కన్వీనర్ వివేక్ వెంకటస్వామి అన్నారు. దుబ్బాక లో బీజేపీ గెలవడంతో GHMC ఎన్నికల్లో కూడా బీజేపీ గెలుస్తుందని.. కేసీఆర్ కు గుబులు పట్టుకుందన్నారు.  తండ్రీ కొడుకులపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. GHMC ఎన్నికల్లో TRS కు ప్రజలు బుద్ది చెబుతారన్నారు.  ఎల్బీనగర్ లో సభ  కూడా అట్టర్ ప్లాప్ అయిందన్నారు. కేసీఆర్ కు రోజులు దగ్గర పడ్డాయన్నారు.

సంజయ్ పై దాడిని  ఖండిస్తున్నామన్నారు. జాతీయ పార్టీకి చెందిన రాష్ట్ర అధ్యక్షుడికి కనీసం సెక్యురిటీ కూడా ఇవ్వడం లేదన్నారు. ప్రజల్లో వ్యతిరేకతో రావడంతో డబ్బులు పంచి గెలవాలనుకుంటున్నారన్నారు.  అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారన్నారు.

గందరగోళం.. సీపీఐ గుర్తుకు బదులు సీపీఎం గుర్తు