అవినీతి ఊబిలో కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సర్కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌..జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెంకటస్వామి

గోదావరిఖని, వెలుగు : కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని, బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ను తరిమికొట్టే రోజులు దగ్గర పడ్డాయని  బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెంకటస్వామి అన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని రాంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  మహాజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సంపర్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అభియాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరుగుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను  ప్రజలకు వివరించారు.   పెద్దమ్మ టెంపుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వద్ద ముదిరాజులతో,  మార్కండేయకాలనీలో పద్మశాలీలతో,  లక్ష్మినగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వ్యాపారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అనంతరం వివేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెంకటస్వామి మాట్లాడుతూ  రాష్ట్రానికి రూ.60 వేల కోట్ల అప్పులు ఉండగా.. కేసీఆర్​  రూ.6 లక్షల కోట్ల అప్పులకు కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తీసుకెళ్ళాడని విమర్శించారు. వ్యవసాయానికి వెయ్యి టీఎంసీల నీళ్ళు ఇస్తామని హామీ ఇచ్చి కనీసం ఇప్పటి వరకు 100 టీఎంసీలు కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. 

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ నెరవేర్చలేదన్నారు.  ప్రధాని నరేంద్ర మోడీ నెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 1 పీఎంగా నిలిచారని, ఆయన పట్ల  62 శాతం మంది  అనుకూలంగా ఉన్నారన్నారు. జీడీపీని  ఏడు శాతానికి పెంచారని, కరోనా సమయంలో 40 వేల కోట్ల వ్యాక్సిన్లను తయారు చేసి అందులో 200 కోట్ల డోస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను వివిధ దేశాలకు పంపారని తెలిపారు.  రైతులకు ప్రతి ఎకరానికి రూ.18 వేల సబ్సిడీని వివిధ రూపాలలో కేంద్రం అందిస్తున్నదని పేర్కొన్నారు.  రాబోయే ఎన్నికల్లో దేశంలో, రాష్ట్రంలో డబుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇంజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సర్కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రావడం ఖాయమని వివేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  అన్నారు.  ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ, బీజేపీ పెద్దపల్లి జిల్లా ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రావుల రాజేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, పార్లమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కన్వీనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పి.మల్లికార్జున్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, అసెంబ్లీ కన్వీనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పిడుగు కృష్ణ, లీడర్లు సోమారపు అరుణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, లావణ్య, వడ్డేపల్లి రాంచందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, దుబాసి మల్లేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మల్లేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యాదవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కామ విజయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, గోవర్ధన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డి, నర్సింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దొర, కుసుమకుమారి, మాతంగి రేణుక, మామిడి రాజేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, జక్కుల నరహరి, సిద్ధార్ధ, దాసరి శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, తిప్పారపు మధు, కె.డేవిడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, గాండ్ల స్వరూప, వివిధ మోర్చాల అధ్యక్షులు, ఇతర 
లీడర్లు పాల్గొన్నారు.