పార్క్ లో మార్నింగ్ వాకింగ్ కు వచ్చినప్పుడు..పేదల కోసం మంచి కాలేజి పెట్టాలనుకుని కాకా కాలేజీ స్థాపించారని చెప్పారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. కాక ఒక్క డ్రీమ్ ఉన్న నాయకుడన్నారు. రాష్ట్రపతి కావాలన్న కాకా ఒక్క కోరిక నెరవేరలేదన్నారు. బాగ్ లింగంపల్లిలోని బీఆర్ అంబేద్కర్ లా కాలేజీ గ్రాడ్యుయేషన్ డేలో మాట్లాడిన వివేక్ వెంకటస్వామి.. కాకా స్పూర్తితోనే విద్యాసంస్థలను తీర్చిదిద్దామన్నారు. కాకా చూపిన దారిలోనే నడుస్తున్నామని.. కాకా సూచనలతో పేదలకు మెరుగైన విద్య అందిస్తున్నామన్నారు.
1980లో పేదలకు రేషన్ విధానం తీసుకొచ్చింది కాకానే అని చెప్పారు వివేక్ వెంకటస్వామి. బీదలకు రూపాయికే అన్నపూర్ణ క్యాంటీన్ తీసుకొచ్చారని అన్నారు. కేంద్ర కార్మికశాఖ మంత్రిగా పెన్షన్ తీసుకొచ్చారని... పేద ప్రజలకు ఇళ్ల జాగలు ఇప్పించారని చెప్పారు.
కాకాకు రాష్ట్రపతి కావాలనే కోరిక ఉండే కానీ.. ఆంధ్ర ప్రదేశ్ నాయకులు అడ్డుపడ్డారని చెప్పారు వివేక్ వెంకటస్వామి. కాకా స్ఫూర్తితో ఒత్తిళ్లు ఉన్నా తాను సేవ చేస్తున్నానని చెప్పారు. యువత కలలు కనాలి. సాధించే వరకు శ్రమించాలని సూచించారు.