కేసీఆర్​పై ఫెమా కేసు పెట్టాలి: వివేక్​ వెంకటస్వామి

కేసీఆర్​పై ఫెమా కేసు పెట్టాలి:  వివేక్​ వెంకటస్వామి

కోల్​బెల్ట్: సీఎం కేసీఆర్ ఫేక్ పాస్ పోర్ట్ దందాతో జనాలను మోసం చేసిండు. ఆయనపై ఫెమా, ఈడీ కేసులు పెట్టి చర్యలు తీసుకోవాలి’ అని చెన్నూరు కాంగ్రెస్​అభ్యర్థి వివేక్​వెంకటస్వామి అన్నారు. మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం రామకృష్ణాపూర్​రాజీవ్​చౌక్ లో​నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. ‘ఎమ్మెల్సీ కవిత లిక్కర్ స్కాంలో మునిగిపోయి వేలాది లక్షలు సంపాదించుకుంది. మనీష్ సిసోడియాను అదుపులోకి తీసుకున్నప్పుడు అదే కేసులో ఉన్న కవితను ఎందుకు అరెస్ట్ చేయలేదు.

కేసీఆర్, బాల్క సుమన్ అధికార అహంకారంతో ఇష్టం ఉన్నట్టు చేస్తున్నరు. ధరణిలో పట్టా భూములను నిషేధిత జాబితాలో పెట్టి కేసీఆర్ దందా చేస్తుండు. ఫేక్ పాస్ పోర్ట్ దందాతో జనాలను అన్నాడు మోసం చేసిండు. ఫెమా, ఈడీ కేసులు కేసీఆర్ పై పెట్టి చర్యలు తీసుకోవాలి. సీఎం, బాల్క సుమన్ కలిసి నాపై ఐటీ రెయిడ్స్​చేయించారు. కేసీఆర్, కేటీఆర్​ఫామ్​హౌస్​లపై మాట్లాడినందుకు రేవంత్​ను జైల్లో పెట్టారు.

 కేసీఆర్, కేటీఆర్ దమ్ముంటే రండి మీ అవినీతిపై చర్చకు నేను సిద్ధంగా ఉన్న. కాళేశ్వరం కట్టిన మేఘ కృష్ణారెడ్డి, కవిత, కేసీఆర్ పై చర్యలు తీసుకోమని బీజేపీకి ఎన్నోసార్లు చెప్పిన చర్యల్లేవు. నాపై ఎంత ఒత్తిడి తెచ్చినా పోరాటం ఆగదు. కాంగ్రెస్​పార్టీ అధికారంలోకి రాగానే కేసీఆర్,​ సుమన్ అరెస్ట్​పక్కా’ అని వివేక్​ తెలిపారు.

  • Beta
Beta feature