మంచిర్యాలలో బీఆర్ఎస్ ఓటమి ఖాయం...

జగిత్యాల జిల్లాలో మాజీ ఎంపీ, బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి పర్యటించారు.  ఇటీవలే అనారోగ్యంతో మృతి చెందిన పలు మృతుల కుటుంబాలను పరామర్శించారు. ధర్మారం పట్టణంలో  గోదావరిఖని కౌన్సిలర్ బట్వాత్ శంకర్ నాయక్ తల్లి మృతి చెందగా.. వారిని పరామర్శించారు. వెల్గటూర్ మండలం స్థంభంపల్లి గ్రామానికి చెందిన బుపెల్లి విజయ్ గుండె పోటుతో మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. 

ఆ తర్వాత మంచిర్యాల జిల్లా లక్షట్టిపేటలో కార్యకర్తలతో కలిసి లంచ్ బైఠక్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంచిర్యాల నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఓడిపోతుందని వివేక్ వెంకటస్వామి అన్నారు. మంచిర్యాల బీజేపీ కార్యకర్తలు బీజేపీ గెలుపు కోసం కృషి చేయాలని సూచించారు. అటు   పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోనూ బీజేపీదే పైచేయిగా ఉందని.. అక్కడ బీజేపీ కార్నర్ మీటింగ్ లు.. మిగతా ప్రాంతాల్లో కంటే చాలా ఎక్కువగా జరిగాయన్నారు.